twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిత్రపురి కాలనీలో 300 కోట్ల కుంభకోణం.. 11 మంది దోచుకొంటూ.. సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు

    |

    సినీ కార్మికులకు సొంతింటి కలను సాకారం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన చిత్రపురి కాలనీ నిర్మాణంలో పలు అక్రమాలు జరిగాయి. నిజమైన కార్మికులకు ఇల్లు దక్కలేదు. ప్రస్తుతం అక్కడ ఉన్న కొందరు సభ్యుల హయాంలో 300 కోట్ల స్కామ్ జరిగింది అంటూ సీనియర్ నటుడు O కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేయడం టాలీవుడ్‌లో కొత్త వివాదానికి దారి తీసింది. డిసెంబర్ నెల 10న చిత్రపురి కాలనీ హోసింగ్ సొసైటీ‌లో జరిగే ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నటుడు ఓ కళ్యాణ్ తన ప్యానల్ సభ్యులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ కావూరి, ఈశ్వర ప్రసాద్ మీసాల, కస్తూరి శ్రీనివాస్, బి నరసింహ రెడ్డి, పసునూరి శ్రీనివాసులు, మన్యవాసి వై వి, శ్రీనివాస కూనపరెడ్డి, ఆత్మకూరు రాధా, మల్లికా టి, మధు జాటోత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ్ సంచలన ఆరోపణలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

    11 మంది దోచుకొంటున్నారు..

    11 మంది దోచుకొంటున్నారు..


    ప్రెస్ మీట్‌లో నటుడు కళ్యాణ్ మాట్లాడుతూ .. గత 35 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నాను. నన్ను అభిమానిస్తూ ఆదరిస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు.. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్నాను, ఫిలిం ఫెడరేషన్‌లో సేవలందించాను. ప్రతి విషయంలో ప్రశ్నిస్తూనే ఉంటాను. ఇక అసలు విషయం ఏమిటంటే .. ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి 65 ఎకరాలు ఇచ్చింది. గత 20 ఏళ్ల నుంచి అక్కడ అవినీతి జరుగుతుంది. 2001, 2005, 2010, 2015 ఇలా ప్రతీసారి చిత్రపురి హౌసింగ్‌లో సినీ కార్మికుల సొమ్మును అక్కడున్న కమిటీ 11 మంది సభ్యులు దోచుకుంటున్నారు అని అన్నారు.

    పాతుకుపోయి అక్రమాలకు పాల్పడుతూ..

    పాతుకుపోయి అక్రమాలకు పాల్పడుతూ..

    చిత్రపురి కాలనీలో జరుగుతున్న కుంభకోణాలను ప్రతీసారి ఫైట్ చేయడం జరుగుతున్నది .. కొందరు ఈ విషయంలో న్యాయం చేయాలనీ చూస్తున్నా కూడా కావడం లేదు. గత 20 ఏళ్ళ నుంచి అవినీతి జరుగుతుంది. సినీ కార్మికుల కోసం ఇచ్చిన దాన్ని దోచుకుంటుంటున్నారు. అక్కడ 300 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. ఈ కమిటీలో ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వర రావు, వినోద్ బాల ఇలా 11 మంది సభ్యులు అక్కడే పాతుకుపోయి అక్రమాలు చేస్తున్నారు అని O కల్యాణ్ సంచలన ఆరోపణలు చేశారు.

    డబ్బులు లేకపోతే..

    డబ్బులు లేకపోతే..

    తమ్మారెడ్డి భరద్వాజ ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. సినిమా వాళ్లకు ఇల్లు కట్టేందుకు డబ్బులు లేవని చెప్పి .. బయటివాళ్లను చేర్చుకోవాలని బయటవాళ్ళతో కుమ్మక్కయి నిర్మాణం చేపట్టారు. మన దగ్గర డబ్బు లేదని అంటే సినిమా వాళ్లంతా క్రికెట్ ఆడో, ఇంకోటి చేసి ఫండ్ కలెక్ట్ చేసిన సందర్భాలు లేవా? ఆ విషయంలో పరిష్కారం ఉన్నా కూడా బయటివాళ్లను మభ్యపెట్టి ఇక్కడ ప్లాట్స్ ఇప్పించడం జరిగింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చేదాంట్లో కూడా అవినీతి జరిగింది. ఇలా జరిగిన ప్రతీసారి నేను అడ్డు పడడం జరుగుతుంది. నాటో పాటు నా కమిటీలో ఉన్న కస్తూరి శ్రీనివాస్, ఎన్నారై, అలాగే నాతొ ఉన్న నా టీం సభ్యులు న్యాయం చేయాలనీ అనుకున్నాం. ఈ విషయంలో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ గారితో సంప్రదించాం కానీ అయన కూడా ఈ విషయంలో ఆసక్తి చూపకపోవడంతోపాటు భరద్వాజ ప్యానెల్‌లో చేరారు.

    అలా 100 కోట్లు నష్టం

    అలా 100 కోట్లు నష్టం

    పరుచూరి వెంకటేశ్వర రావు అండ్ కమిటీ పై మేము ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 51 ఎంక్వయిరీకి ప్రభుత్వం కమిటీ వేసింది. ఇక్కడ ఐవిఆర్‌సిఎల్ అనే కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల మొబిలైజేషన్ డిపాజిట్ అనేది మనం పేయ్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రతి బిల్ కు 10 శాతం కట్ చేయాలి. కానీ వీళ్ళ కిక్ బ్యాంక్స్ తరహాలో వెనక డబ్బు వసూలు చేసుకుని తినేశారు. అలా ఆ డబ్బు 55 కోట్ల వరకు పెరిగింది. దాని ఇంట్రెస్ట్‌తో కలిపి 100 కోట్లు అయింది. అలా వందకోట్ల నష్టం కలుగజేసారు అని కల్యాణ్ అన్నారు.

    Recommended Video

    Niharika Konidela wedding Saree Speciality
    ఎన్నికలతో వేడెక్కిన వాతావరణం

    ఎన్నికలతో వేడెక్కిన వాతావరణం

    త్వరలోనే చిత్రపురి హౌసింగ్ సొసైటికీ ఎన్నికలు జరుగనుండటంతో టాలీవుడ్‌లో వాతావరణం వేడెక్కినట్టు కనిపిస్తున్నది. గత కొద్ది రోజులుగా చిత్రపురి కాలనీలో సమావేశాలు భారీగా జరుగుతున్నాయి. పోటాపోటీగా ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తున్నది. రాబోయే రెండు మూడు రోజుల్లో మరిన్ని ప్రెస్‌మీట్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    Actor O Kalyan alleges that 300 crores scam in Tollywood's Chitrapuri film housing society. He made sensational comments on Chitrapuri Housing society committee members. He criticises the committee members including Tammareddy Bhardwaja and C Kalyan and others.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X