ప్రముఖ హాలీవుడ్ నటుడు ఓమర్ షరీఫ్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ హాలీవుడ్ నటుడు ఒమర్ షరీఫ్(83) అనారోగ్య సమస్యలతో కన్నుమూసారు. అల్జిమిర్ వ్యాధితో కొద్దికాలంగా అస్వస్థతతో ఉన్న షరీఫ్ గుండెపోటుతో మరణించారు.
ఈ జిప్టులో జన్మించిన ఒమర్ షరీఫ్.... లారెన్స్ ఆఫ్ అరేబియా(1962), డాక్టర్ జివాగో(1965), ఫన్నీ గర్ల్ (1968) తదితర హాలీవుడ్ చిత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చివరి సినిమా 2013లో వచ్చిన ‘రాక్ దకాస్బా'.

ఒమర్ షరీఫ్ ఒకసారి ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంతో పాటు, మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సొంతం చేసుకున్నారు. 1953లో నాటి దబ్లేజింగ్ సన్ సినిమాలో తనతో పాటు నటించిన ఫాతెన్ హమామాను షరీఫ్ పెళ్లాడారు. ఆమెను పెళ్లాడేందుకు క్రైస్తవ మతం నుండి ఇస్లాంలోకి మారాడు.


Click it and Unblock the Notifications











