రెస్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ భారీ ప్లాన్.. 2021లో అభిమానులకు పండగే..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరకు లాంగ్ గ్యాప్ ఇచ్చినా కూడా ఆయనపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఇటీవల సోషల్ మీడియాలో ఆయనకు వచ్చిన బర్త్ డే విషెస్ చూస్తేనే అర్ధమయ్యింది. మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు చాలా మంది హీరోలు పవర్ స్టార్ కి ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలిపారు. నిజంగా అభిమానులకు ఈ బర్త్ డే చాలా ఆనందాన్ని ఇచ్చింది.
దానికి తోడు ఒకేసారి నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రావడం మరింత కిక్కిచ్చింది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. 2021లో అభిమానులు మరింత జోష్ లో ఉండే విధంగా పవన్ సరికొత్తగా అడుగులు వేయబోతున్నాడు. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ ఏండింగ్ లో ఉంది. ఇక డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించనున్న సినిమా కూడా తొందరగానే పూర్తవుతుంది. అంటే 2021మొదట్లో వకీల్ సాబ్ ఆ తరువాత సమ్మర్ లో క్రిష్ సినిమాను రిలీజ్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నాడు.

ఇక సమ్మర్ లో గబ్బర్ సింగ్ డైరెక్ట్ హరీష్ శంకర్ సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే అవకాశం ఉంది. కరోనా తగ్గితే వెంటనే ఈ ప్లాన్ ను అమలుపరిచి అనుకున్న సమయానికి సినిమాలను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఇక కుదిరితే వచ్చే ఏడాదే సురేందర్ రెడ్డి సినిమాను కూడా స్టార్ట్ చేయవచ్చు. కానీ ఆ సినిమా 2022లోనే వస్తుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ లైనప్ అభిమానుల్లో అంచనాల డోస్ ని ఆకాశానికి పెంచుతోంది. మరి రాబోయే ఆ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











