»   » ఐసిఎఫ్‌ఎఫ్ఐ ముగింపు, ప్రత్యేక అతిథిగా పవన్ కళ్యాణ్!

ఐసిఎఫ్‌ఎఫ్ఐ ముగింపు, ప్రత్యేక అతిథిగా పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదాబాబాద్: గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న 18 అంతర్జాతీయ చలన చిత్రోత్సవం బుధవారం ముగియనుంది. ముగింపు వేడుకలను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని లలిత కళా తోరణంలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ ముగింపు వేడుకకు ప్రముఖ తెలుగు సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ మేరకు ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వానం అందింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డికె. అరుణ ఈ వేడుకలను పర్యవేక్షిస్తున్నారు. నవంబర్ 14 ప్రారంభమైన ఈ చలన చిత్రోత్సవంలో ఇప్పటి వరకు దేశ విదేశాలకు చెందిన 200లకుపైగా చిత్రాలను హైదరాబాద్‌‍లోని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శించారు. ప్రసాద్స్ ఐమాక్స్ ఈ చిత్రోత్సవానికి ప్రధాన వేదిక.

ఈ కార్యక్రమంలో ముందుగా అనేకమంది బాలబాలికలు చేసిన సాంస్క్రృతిక కార్యక్రమాలతో ఆహుతులను అలరించనున్నారు. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ ఎలిఫెంట్ అవార్డ్, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును ఎవరు అందుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిల్వర్ ఎలిఫెంట్ అవార్డును సొంతం చేసుకోవడానికి అనేక సినిమాలు పోటీ పడుతున్నాయి. అదే విధంగా ఉత్తమ యానిమేషన్ చిత్రం, ఉత్తమ దర్శకుడి విభాగంలో పలు చిత్రాలు పోటీ పడుతున్నాయి.

English summary
At last there will be some Tollywood flavour in the 18thInternational Children's Film Festival India (ICFFI) in the city. Well-known film star Pawan Kalyan will attend the closing ceremony at the Lalitha Kala Thornam at public gardens this evening as a special invitee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu