»   » సంచలనాలు, వివాదాలు... అయినా పిచ్చి అభిమానం (పవన్ జీవితం-రేర్ పిక్స్)

సంచలనాలు, వివాదాలు... అయినా పిచ్చి అభిమానం (పవన్ జీవితం-రేర్ పిక్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఆయన పేరు చెపితే చాలు అభిమానుల ఏదో తెలియని ఉత్సాహం, వీరాభిమానం.... ఆయన సినిమా విడుదలైతే చాలు బాక్సాఫీస్ పాత రికార్డులు బద్దలవుతాయి, కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఆయన సినిమా చూడాలన్న ఆసక్తే... ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

  ఈ రోజు పవన్ పుట్టిన రోజు. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ 1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిన పవన్ కళ్యాణ్ హిట్, ప్లాప్ లతో సంభంధం లేని స్టార్ హీరోగా ఎదిగారు.

  'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'సుస్వాగతం', 'బద్రి' మరియు 'ఖుషి' చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ సాదించి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగారు. అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

  చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టినప్పటికీ, తనకంటూ ప్రత్యేకమైన స్టయిల్‌తో యువతరం అభిమాన హీరోగా మారి, 'ఖుషి'తో అనూహ్యమైన క్రేజ్‌నూ, ఇమేజ్‌నూ సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. సాహిత్యాభిమాని కూడా అయిన కళ్యాణ్‌లో ఉన్న సృజనాత్మక శక్తి ఆయనను దర్శకత్వం వైపు మళ్లించింది.

  తెలుగు చలన చిత్ర సీమలో ఎవరికీ దక్కనటువంటి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజల పక్షాన పోరాడటం కోసం ఇటీవలే రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. సినిమాల్లో ఆయన సక్సెస్ అయినట్లే రాజకీయాల్లోనూ సూపర్ సక్సెస్ కావాలని ఆశిస్తూ... ఆయనకు వన్ ఇండియా ఫిల్మీబీట్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు..

  కొణిదెల కల్యాణ్ బాబు

  కొణిదెల కల్యాణ్ బాబు


  పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కల్యాణ్ బాబు. కొణిదెల వెంకటరావు, అంజనా దేవి దంపతుల మూడో కుమారుడు. సెప్టెంబరు 2, 1972న జన్మించాడు.

  పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్


  పవన్ కళ్యాణ్ ప్రాథమిక విద్య పశ్చిమగోదావరి జిల్లాలోనే జరిగింది. ఇంటర్ మీడియట్ నెల్లూరు లోని వి.ఆర్.సి కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.

  సినిమాల్లోకి

  సినిమాల్లోకి


  1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా "కళ్యాణ బాబు"గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

  భిన్నమైన ఆలోచనా విధానం

  భిన్నమైన ఆలోచనా విధానం


  తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది

  పిన్నవయసులోనే..

  పిన్నవయసులోనే..


  అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు.

  మార్షల్ ఆర్ట్స్

  మార్షల్ ఆర్ట్స్


  సినిమాల్లోకి రాక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. కరాటేలో బ్లాక్ బెల్ట్.

  అంతా షాక్

  అంతా షాక్


  తన సినిమాల్లో ఎలాంటి డూప్స్ లేకుండా ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలు చేసేవారు, చేతులపై నుండి కార్లు పోనిచ్చుకోవడం, చాతిపై పెద్ద పెద్ద బండరాళ్లు బద్దలు కొట్టించుకోవడం అప్పట్లో సెన్సేషన్.

  అన్నయ్య సినిమాలకు కూడా..

  అన్నయ్య సినిమాలకు కూడా..


  తొలి నాళ్లలో తన చిత్రాలకి, అన్నయ్య చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్ లని రూపొందించారు.

  ఫ్రెండ్లీ నేచర్

  ఫ్రెండ్లీ నేచర్


  తానో పెద్ద స్టార్ అనే గర్వం ఆయనకు అస్సలు ఉండదని, పరిశ్రమలో అందరితో పవన్ కళ్యాణ్ ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటారనే పేరుంది.

  రేణు దేశాయ్ తో..

  రేణు దేశాయ్ తో..


  నటి రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ ప్రయాణం అప్పట్లో ఓ సెన్సేషన్. బద్రి సినిమాతో పరిచయం అయిన ఇద్దరూ సహజీవనం మొదలు పెట్టారు. ఇద్దరూ పెళ్లికి ముందే బిడ్డను కూడా కన్నారు. అప్పటి పవన్ కళ్యాణ్ కు ఒక మహిళతో వివాహం అయి విడాకులు కూడా అయ్యాయి. అన్నయ్య రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న వేళ ఒత్తిడితో 2009లో రేణు దేశాయ్ ని పెళ్లాడాడు పవన్.

  మూడో పెళ్లితో సంచలనం

  మూడో పెళ్లితో సంచలనం


  ఇద్దరు పిల్లలతో ఎంతో అన్యోన్యంగా సాగుతున్న రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ వివాహ బంధం తెంచుకుకోవడం, రష్యన్ మహిళ అన్నా లెజెనివాను ఎవరికీ తెలియకుండా రహస్యంగా మూడో వివాహం చేసుకోవడం అప్పట్లో సంచలనం. ఈ వ్యవహారంతో పవన్ కళ్యాణ్ మీద విమర్శలు సైతం వచ్చాయి.

  ఆదుకునే గుణం

  ఆదుకునే గుణం


  రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా తన సినిమా వల్ల నష్ట పోయిన వారికి పవన్ అనేక సందర్భాల్లో అండగా ఉన్నారు. పవన్ నటించిన 'జానీ' సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వల్ల లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోయిన అమౌంట్ ఇచ్చి ఆదుకున్నారు పవన్. తర్వాత కూడా తన ఇతర సినిమాల విషయంలో నష్టపోయిన వారికి ఏదో ఒక విధంగా సర్దుబాటు చేసేవారు.

  అభిమానులకు

  అభిమానులకు


  అభిమానులైనా, మరెవరైనా అపదలో ఉన్నారంటే చాలు కాదనకుండా సహాయం చేయడం పవన్ కళ్యాణ్ నైజం. ఇలాంటి గుణం కూడా పవన్ కళ్యాణ్ కు అభిమానుల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగేలా చేసింది.

  వ్యవసాయం

  వ్యవసాయం


  పవన్‌కి వ్యసాయం చేయడమంటే చాలా ఇష్టం. అందుకే షూటింగ్‌లులేని సమయంలో హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హౌస్‌లో కాయగూరలు, పండ్ల మొక్కలు పెంచుతుంటారు.

  ఆ ఆవేశమే..

  ఆ ఆవేశమే..


  పవన్ కళ్యాణ్ కి కాస్త ఆవేశం ఎక్కువే...తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంటే సహించలేని ఆవేశమే ఆయన రాజకీయాల వైపు వచ్చేలా చేసింది. జనసేన పార్టీ స్థాపించడానికి కారణమైంది.

  తన జీవితం

  తన జీవితం


  రాజకీయనేతగా ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014 న జనసేన పార్టీ స్థాపించారు. తన జీవితం ఇక ప్రజల కోసమే అని ఇటీవల తిరుపతి సభలో ప్రకటించారు పవన్ కళ్యాణ్.

  రైతుల పక్షాన

  రైతుల పక్షాన


  ఇటీవల ఏపీ రాజధాని అమరావతి కోసం బూసేకరణ వల్ల అన్యాయం జరుగుతుందని ఆందోళన చేసిన రైతులకు పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారు.

  అభిమానులకు

  అభిమానులకు


  అభిమానులకు పవన్ కళ్యాణ్ చాలా విలువనిస్తాడు. వారి వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని నమ్మే వ్యక్తుల్లో ఆయన ఒకరు.

  అన్నయ్యతో రిలేషన్

  అన్నయ్యతో రిలేషన్


  ఆ మధ్య కొరన్ని పరిణామాలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య రిలేషన్ దెబ్బతిందనే రూమర్స్ కు కారణమయ్యాయి. అయితే అలాంటి దేమీ లేదని చిరు 60వ పుట్టినరోజున తేలిపోయింది.

  రేర్ పిక్

  రేర్ పిక్


  ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ తో కలిసి పవన్ కళ్యాణ్ రేర్ పిక్.

  English summary
  Actor Pawan Kalyan turns 44 today. Konidela Kalyan Babu, better known by his stage name Pawan Kalyan, is an Indian film actor, producer, director, screenwriter, writer, and politician.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more