సినీ రంగానికి కమల్ హాసన్ గుడ్‌బై.. నా చివరి సినిమా అదే.. షాక్‌లో అభిమానులు!

విలక్షణ నటుడు కమల్ హాసన్ సినీ అభిమానులకు, ప్రేక్షకులకు షాకిచ్చాడు. త్వరలోనే తాను నటనకు స్వస్తి చెబుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కమల్ నిర్ణయంతో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. తమిళ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కమల్ హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రజల్లోకి వెళ్లడానికే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన తెలిపారు. తన యాక్టింగ్ కెరీర్‌కు గుడ్‌బై చెబుతూ ఏమన్నారంటే..

 రాజకీయాల్లో క్రియాశీలకంగా

రాజకీయాల్లో క్రియాశీలకంగా

బహుభాషా నటుడు కమల్ హాసన్ మక్కల్ నీధి మాయం అనే రాజకీయ పార్టీ స్థాపించడం ద్వారా తమిళనాడు పాలిటిక్స్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సంసిద్దం అవుతున్నారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టేందుకు వ్యూహాన్ని రచిస్తున్నారు.

సినీ రంగానికి, నటనకు గుడ్‌బై

సినీ రంగానికి, నటనకు గుడ్‌బై

త్వరలోనే నేను సినీ రంగానికి గుడ్‌బై చెప్పబోతున్నాను. రాజకీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ నిర్ణయం తీసుకొన్నాను. నటనకు స్వస్తి చెప్పి పొలిటికల్ కెరీర్‌ను కొనసాగిస్తాను. ప్రజల సంక్షేమానికి శేష జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకొన్నాను అని కమల్ ఓ ప్రకటనలో తెలిపారు.

ఇండియన్2 చివరి సినిమా

ఇండియన్2 చివరి సినిమా

రోబో 2.0 తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించే ఇండియన్ 2 చిత్రంలో కమల్ హాసన్ నటిస్తున్నాడు. తన సినీ కెరీర్‌లో ఇండియన్ 2 సినిమానే చివరి మూవీ అని కమల్ స్పష్టం చేశారు. ఇండియన్ 2 సినిమా డిసెంబర్ 14న సెట్స్‌పైకి వెళ్తుంది అని వెల్లడించారు.

కమల్ సరసన కాజల్ అగర్వాల్

కమల్ సరసన కాజల్ అగర్వాల్

ఇండియన్ 2 మూవీలో కమల్ సరసన తెలుగు హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటించనున్నారు. తాను ఇండియన్2 మూవీలో నటిస్తున్నట్టు కాజల్ ధృవీకరించారు. తాజగా జరిగిన మీడియా మీట్‌లో ఇండియన్ 2 మూవీ గురించి మరోమారు స్పష్టంగా చెబుతానని పేర్కొన్నారు. ఈ చిత్రంలో కాజల్‌తోపాటు మరో యువ హీరోయిన్‌ కూడా కీలక పాత్రలో నటించనున్నది.

ఆరేళ్ల వయసులో బాల నటుడిగా

ఆరేళ్ల వయసులో బాల నటుడిగా

కమల్ హాసన్ ఆరేళ్ల వయసులో బాల నటుడిగా సినీ కెరీర్‌ను ప్రారంభించారు. అసిస్టెంట్ డ్యాన్సర్‌గా పనిచేస్తూ హీరోగా మారారు. నాలుగు దశాబ్దాలకుపైగా కెరీర్‌లో ఉన్న ఉత్తమ అవార్డులు గెలుచుకొన్నారు. వందకుపైగా సినిమాల్లో నటించారు. ఆయన నటించే సుభాష్ నాయుడు మధ్యలోనే ఆగిపోయింది. శంకర్ డైరెక్షన్‌లో వచ్చే ఇండియన్ 2 సినిమా ఆయనకు చివరి చిత్రంగా కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X