తారక రత్నకు కార్డియాక్ అరెస్ట్.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

నందమూరి తారకరత్నకు హఠాత్తుగా గుండెల్లో నొప్పి రావడంతో స్పృహ తప్పి పడిపోయారు. ఇటీవల రాజకీయ నాయకుడిగా సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన తారకరత్న ప్రతి మీటింగ్ లో కూడా పాల్గొంటున్నారు అయితే ఈ క్రమంలో లోకేష్ తో కలిసి కుప్పంలో ఆయన పాదయాత్ర చేస్తుండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

తారకరత్న హఠాత్తుగా పడిపోవడంతో ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. దీంతో తారకరత్న ను వెంటనే సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలోకి తీసుకువెళ్లారు. లోకేష్ యాత్రలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక బాలకృష్ణ కూడా ఘటన గురించి తెలుసుకొని వెంటనే హాస్పిటల్ కి వెళ్ళారు.

అత్యవసరం చికిత్స కోసం బెంగుళూరుకు

ప్రస్తుతం అత్యవసర చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే తారకరత్న మెరుగైన చికిత్స అందించడానికి బెంగళూరుకు కూడా తీసుకువెళ్లే అవసరం ఉన్నట్లుగా కథనాలు వెలువడుతున్నాయి ఇప్పటికే వైద్యులు అత్యవసరం చికిత్స అందించి అందించడంతో కాస్త మెరుగైనట్లు సమాచారం అయితే ఇంకా తారకరత్న పూర్తిగా కోలుకోలేనట్లు కూడా తెలుస్తోంది అందుకే బెంగళూరుకు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించినట్లు సమాచారం ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

45 నిమిషాల తర్వాత

45 నిమిషాల తర్వాత

మొదట తారకరత్న నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో వెంటనే వైద్యులు సిపిఆర్ నిర్వహించడం జరిగింది. 45 నిమిషాల తర్వాత పల్స్‌ మొదలైంది. అప్పుడు అతని ఆరోగ్యం కాస్త నిలకడ అయినట్లుగా వైద్యులు తెలిపారు. మొత్తానికి అయితే హార్ట్ బీట్ బాగుంది అని కొలుకునే విధంగా వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

రెండు గంటల సమయం

రెండు గంటల సమయం

అయితే ఇప్పుడు బెంగళూరుకు తీసుకువెళ్తారా లేదా అనే విషయంలో మాత్రం అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు పంపించాలి అంటే దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. అక్కడికి తీసుకెళ్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక వైద్యులు మాత్రం బెంగళూరుకి పంపించకుండా కుప్పం హాస్పిటల్ లోనే మెరుగైన చికిత్స అందించి కోలుకునేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

యోగక్షేమాలు తెలుసుకుంటున్న బాలకృష్ణ

యోగక్షేమాలు తెలుసుకుంటున్న బాలకృష్ణ

కుప్పంలోనే పిఎస్ మెడికల్ వైద్యులు నందమూరి తారకరత్న కోలుకోవాలని తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్యం మెరుగుపడే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా కూడా చెబుతున్నారు. తారకరత్న పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు బాలకృష్ణతో పాటు చంద్రబాబు కూడా వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఆయన కోలుకోవాలని అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X