పవన్‌కి కూడా ముప్పు ఉంది.. 150 కోట్లు సంపాదిస్తాడు, సీరియస్‌గా తీసుకోవాలి.. నటుడు పోసాని!

Recommended Video

Pawan Kalyan Gets Applauds From Posani Krishna Murali

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నాన్ని సినీ రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తరచుగా జగన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసే నటుడు పోసాని కృష్ణ మురళి ఈ ఘటన గురించి స్పందించాడు. జగన్ పై జరిగిన దాడిని ఖండించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల పవన్ తనకు కూడా ప్రాణ హాని ఉందని చేసిన వ్యాఖ్యలని పోసాని గుర్తు చేశారు. ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పోసాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే

పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే

జగన్ పై దాడికి సంబందించిన టివి చర్చలో పాల్గొంటూ పోసాని పవన్ పై ప్రశంసలు కురిపించారు. పవన్ ఒప్పుకుంటే ఇండియాలో ఎవ్వరికి ఇవ్వనంత రెమ్యునరేషన్ ఇచ్చి డేట్లు నాకు ఇవ్వండి అని అడుగుతా. పవన్ కళ్యాణ్ కు సినిమాల్లో అంతా డిమాండ్ ఉందని అన్నారు.

150 కోట్లు సంపాదిస్తాడు

150 కోట్లు సంపాదిస్తాడు

పవన్ కళ్యాణ్ సినిమాల్లో కొనసాగితే ఏడాదికి సులభంగా 150 కోట్లు సంపాదిస్తాడు అని పోసాని అన్నారు. సినిమాల్లో పవన్ కోరుకున్న విధంగా లగ్జరీ జీవితాన్ని అనుభవించవచ్చు. కానీ అన్నింటిని విడిచిపెట్టి.. నేను కూడా సమాజానికి సేవచేయాలి అనే ఉద్దేశంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చారని పోసాని అన్నారు.

పవన్‌కి కూడా ముప్పు ఉంది

పవన్‌కి కూడా ముప్పు ఉంది

ప్రతి ఒక్కరు ఎదో ఒక సందర్భంలో పొరపాటుగా మాట్లాడుతూ ఉంటారు. అందుకు పవన్ మినహాయింపు కాదు. కానీ పవన్ నోటి నుంచి ఓ మాట వచ్చిందంటే అందులో ఎంతో కొంత వాస్తవం ఉంటుందని పోసాని అన్నారు. నాకు ప్రాణ హాని ఉందని పవన్ ఇటీవల వ్యాఖ్యానించారు. అందులో నిజం ఉండే ఉంటుందని పోసాని అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న పాపులారిటీ అలాంటిది. ఆయన ప్రభుత్వం జెడ్ కేటగిరి భద్రత కల్పించే ఆలోచన చేయాలని పోసాని అన్నారు.

 పవన్ షూటింగ్‌లో ఉంటే

పవన్ షూటింగ్‌లో ఉంటే

పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి మద్దత్తు తెలిపినన్ని రోజులు రాచమర్యాదలు చేశారని పోసాని గుర్తు చేసుకున్నారు. పవన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటే ఇద్దరు మంత్రులు ఇన్విటేషన్ ఇవ్వడానికి బయట ఎదురుచూశారని.. అది పవన్ స్థాయి అని పోసాని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X