twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే భరత్ డ్రగ్స్‌కు బానిస.. పూరీ మంచొడు.. కమ్మవాళ్లు గోళ్లు గిల్లుకుంటున్నారు.. పోసాని

    సినీ పరిశ్రమలో మాటల రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రత్యేకమైన మనస్తత్వం. ఎదుటివాడు ఎవడైనా సరే.. ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన బిహేవియర్.

    By Rajababu
    |

    సినీ పరిశ్రమలో మాటల రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రత్యేకమైన మనస్తత్వం. ఎదుటివాడు ఎవడైనా సరే.. ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన బిహేవియర్. నిజాయితీగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తారనే పేరు ఆయన సొంతం. సినీ పరిశ్రమ గానీ, రాజకీయాలు గానీ తనకు నచ్చకపోయినా, సమాజానికి కీడు చేస్తున్నారని అనిపించినా వారిపై విరుచుకపటడం పోసాని నైజం. మెంటల్ కృష్ణగా పేరును సొంతం చేసుకొన్న పోసాని ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికతో ప్రత్యేకంగా మాట్లాడారు.

    నిజాయితీగా బతుకడమే నా ఫిలాసఫీ

    నిజాయితీగా బతుకడమే నా ఫిలాసఫీ

    నిజాయితీగా బతుకాలి అన్నది నా ఫిలాసఫీ. నేను ఎలా ఉంటానో అలాగే బతుకుతాను. నా వెనుక ఎవరో ఉన్నారని మాట్లాడను. ఎవరినీ వెన్నుపోటు పొడవను. ఎవరినీ ఆకాశానికెత్తేసి పొగడ్తలు కురిపించను. ఒకవేళ పొగుడాలనుకున్నప్పుడు వారు చేసిన తప్పులను కూడా ఎత్తి చూపుతాను. అందుకు ఎవరికీ బయపడను. నాకేమవుతుందనే భయం లేదు అనే విధంగా పోసాని మాట్లాడారు.

    Recommended Video

    Posani Krishna Murali Reacted on Ram Gopal Varma's NTR Biopic
    కమ్మ కులం వాళ్లు గోళ్లు గిల్లుకొంటున్నాడు..

    కమ్మ కులం వాళ్లు గోళ్లు గిల్లుకొంటున్నాడు..

    నేను ఉన్నతస్థాయికి చేరుకోవడానికి కులం అసలే కాదు. సినీ పరిశ్రమలో గోళ్లు గిల్లుకొంటూ ఉన్న కమ్మవారు చాలా మంది ఉన్నారు. ఏ రంగమైనా కులం ఉంటే సరిపోదు. వాడికి రాణించే సత్తా ఉండాలి. కష్టపడి పనిచేసే అలవాటు ఉండాలి. అంతేగాని కులం పేరు చెప్పుకొని ఎంతకాలం బతుకుతారు.

    పనిచేసేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొంటాను

    పనిచేసేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకొంటాను

    నేను పనిచేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొంటాను. సినిమాలకు మాటలు మామూలుగానే రాశాను. బాగా కష్టపడి రాసిన దాఖలాలు లేవు. కొన్నిసార్లు సీన్లు బాగా రాయమంటే వాటిని తిరగరాసేవాడిని. అంతేగానీ పెద్దగా కష్టపడినట్టు అనిపించదు. ఇష్టమైన పనిచేసేటప్పుడు చేసే పని కష్టంగా అనిపించదనే ధోరణితో ఆయన మాట్లాడారు.

    ఆ విషయంలో కచ్చితంగా ఉంటా..

    ఆ విషయంలో కచ్చితంగా ఉంటా..

    నటుడిగా మారిపోయిన తర్వాత సినిమా షూటింగ్‌లతో బిజీగా మారాను. అందుకే నేను నిర్ధిష్టమైన సమయాన్ని పాటిస్తాను. సాయంత్రం ఐదు గంటల తర్వాత నేను షూటింగ్‌లో పాల్గొనను. ఆరోగ్యం విషయంలో కచ్చితమైన సూత్రాలను పాటిస్తాను. బయట ఎక్కడ పడితే అక్కడ తినను. సమయానికి వెళుతాను.. సమయానికి తిరిగి వస్తాను అని పోసాని పేర్కొన్నారు.

    డబ్బే జీవితం కాదు..

    డబ్బే జీవితం కాదు..

    రాత్రంతా షూటింగ్ చేసి ఆరోగ్యం పాడు చేసుకొనని ఆయన అన్నారు. సంపాదించేంది కుటుంబం కోసమే కాబట్టి వారికి సమయాన్ని కేటాయించాలి అని అన్నారు. మనం బతుకడానికి డబ్బు కావాలి.. కానీ డబ్బే జీవితం కాదు అని పోసాని అన్నారు.

    భరత్ వెన్నుపోటు పొడవలేదు..

    భరత్ వెన్నుపోటు పొడవలేదు..

    కారు ప్రమాదంలో మరణించిన రవితేజ సోదరుడు భరత్‌తో తన అనుబంధాన్ని పోసాని కృష్ణమురళీ గుర్తు చేసుకొన్నాడు. భరత్ నా కులం వాడు కాదు. వాడు ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. మోసం చేయలేదు. కొన్ని కారణాల వల్ల జీవితంలో దెబ్బ తిన్నాడు. కొన్ని వ్యసనాలకు బానిస అయ్యాడు. కానీ భరత్ చాలా మంచివ్యక్తి. మంచితనం వేరు, బలహీనత వేరు. వాటి మధ్య చాలా తేడా ఉంది అని పోసాని తెలిపారు.

    డ్రగ్స్‌తో టాలీవుడ్‌కు చెడ్డపేరు

    డ్రగ్స్‌తో టాలీవుడ్‌కు చెడ్డపేరు

    తెలుగు సినీ పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ అలవాటు ఉండోచ్చు. కానీ వాటివల్ల ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తున్నది. అందరూ అలాంటి వారు కాదు. వారి వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల వారు వాటికి అలవాటు పడొచ్చు. చాలా మంది హీరోలు, నిర్మాత, దర్శకుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో కాదో త్వరలోనే తెలుస్తుంది అని అన్నారు.

    పూరీ డగ్స్ తీసుకొంటాడా అనేది తెలీదు..

    పూరీ డగ్స్ తీసుకొంటాడా అనేది తెలీదు..

    దర్శకుడు పూరీ జగన్నాథ్ వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్నాయి. పూరీ చిత్రాల్లో నటించాను. అతని గురించి ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకొంటాను. ఆయన డ్రగ్స్ వినియోగిస్తారా లేదా అనే విషయం నాకు తెలియదు. పర్సనల్‌గా పూరీ తెలుసు. ఇష్టం. కానీ ఆయన వ్యక్తిగత జీవితం తెలియదు అని పూరీ అన్నాడు.

    English summary
    Actor Posani Krishna Murali made sensational comments on Director Puri Jagannath, Actor Bharath. He said Personal problems made Bharath druggist. I dont know Whether Puri Jagannath takes drugs or not. Posani says he was very particular about his personal life too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X