Krishnam Raju: క్యారెక్టర్ లేకపోతే నువ్ వేస్ట్ అన్నారు.. పెదనాన్న అంటే అంత ఇష్టం.. ప్రభాస్ మాటల్లో..

రెబల్ స్టార్ ప్రభాస్ తన తండ్రిని కోల్పోయినప్పుడే ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఇక తర్వాత తండ్రి సమానులు అయినటువంటి పెదనాన్న కూడా ఇప్పుడు తనువు చాలించడంతో ప్రస్తుతం డార్లింగ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టంగానే ఉంటుంది. రెబల్ స్టార్ బ్రాండ్ నుంచి వచ్చిన ప్రభాస్ కు పెదనాన్న అంటే చాలా భక్తి గౌరవం అలాగే ఎంతో ఇష్టం కూడా.

ఇక కృష్ణంరాజు మరణం తరువాత ప్రభాస్ తో ఉన్న అనేక ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అలాగే తన పెదనాన్న అంటే ప్రభాస్ కు ఎంత ఇష్టమో కూడా గతంలో ఒక సినిమా ఈవెంట్ లోని మాటలు వింటే అర్ధమవుతుంది. ఆ మాటలు ఒకసారి గుర్తుచేసుకుంటే..

పెదనాన్న స్పూర్తితో

పెదనాన్న స్పూర్తితో

కృష్ణంరాజు మృతి చెందడం చిత్ర పరిశ్రమకు అలాగే ప్రభాస్ ఫ్యామిలీకి తీరని లోటు. ముఖ్యంగా ప్రభాస్ ప్రతీ విషయంలోను పెదనాన్న సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రభాస్ ఆయన స్ఫూర్తి తోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పుకుంటు ఉంటాడు.

ఎంతో గొప్పగా

ఎంతో గొప్పగా

కృష్ణంరాజు తమ్ముడి వారసుడిగా ప్రభాస్ వెండితెరకు పరిచయమయ్యాడు. ఇక ఈ ఫ్యామిలీ నుంచి 2011లో సిద్దార్థ్ రాజ్ కుమార్ కూడా హీరోగా పరిచయమయ్యాడు. ప్రభాస్ కజిన్ అయిన సిద్దార్థ్ ఫస్ట్ సినిమా కెరటం కృష్ణంరాజు చేతుల మీదుగా మొదలైంది. ఇక ఆ సినిమా ఆడియో ఈవెంట్ లో ప్రభాస్ తన పెదనాన్న గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మా ఫ్యామిలీకి ఒక డైమండ్

మా ఫ్యామిలీకి ఒక డైమండ్

ప్రభాస్ మాట్లాడుతూ.. నేను ఇలా ఇక్కడ ఉండడానికి కారణం పెదనాన్న గారు. నా లైఫ్ లో నేను గొప్పగా యాక్ట్ చేసినా.. అలాగే ఏదైనా గొప్ప పేరు తెచ్చుకున్నా కూడా అది ఆయన వల్లే. ఇక ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తే అది నాకే. నాకు మాత్రమే కాకుండా నా ఫ్యామికి అందరికి కూడా ఆయన ఒక స్ఫూర్తి. మా ఫ్యామిలీకి ఒక డైమండ్.. కింగ్ లాంటి వారు.. అని అన్నాడు.

క్యారెక్టర్ లేకపోతే నువ్ వేస్ట్

క్యారెక్టర్ లేకపోతే నువ్ వేస్ట్

నా ఫస్ట్ ఫిల్మ్ ఈశ్వర్ తీసినప్పుడు నాకు ఒక్కటే చెప్పారు. హార్డ్ వర్క్ ఎప్పుడు ముఖ్యంగా. అదే మొదటి సక్సెస్. నువ్వు చేసేది హిస్టరీలో ఉంటుంది. దానితో పాటు క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ఎంత చేసినా.. సూపర్ స్టార్ గా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా.. క్యారెక్టర్ లేకపోతే నువ్ వేస్ట్ అన్నారు. మా ఫ్యామిలీలో ప్రతీ ఒక్కరం కూడా పెదనాన్న కు రుణపడి ఉంటాము.. అని ప్రభాస్ అన్నాడు.

అంతా అబద్ధం..

అంతా అబద్ధం..

ఇక ప్రభాస్ అలా మాట్లాడిన తరువాత కొంత ఎమోషనల్ అయిన కృష్ణంరాజు వెంటనే మైక్ అందుకొని ప్రభాస్ యాక్టింగ్ లోకి వచ్చిన తరువాత నటుడిగా అతన్ని చూసి నేను నేర్చుకున్నవి కూడా ఉన్నాయి. అది నాకు మహానందం. ఇక పక్కన ఉన్న ప్రభాస్ మైక్ మళ్ళీ తీసుకొని అంతా అబద్ధం అని నవ్వుతూ అన్నాడు. ఇక అబద్ధం చెప్పడం ఈ కృష్ణంరాజు జీవితంలోనే లేదని అనగానే ప్రభాస్ వెనకాల నుంచి ఆప్యాయంగా హగ్ చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X