HBD Prakash Raj ముందు మనిషిగా చచ్చి.. ఆ తర్వాత మరణించడం ఇష్టం లేదు.. ప్రకాశ్ రాజ్
కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై అవకాశం లభించినప్పుడల్లా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్వరం పెంచడం గమనిస్తూనే ఉంటాం. మతవాద రాజాకీయలకు స్వస్థి చెప్పాలి. అభివృద్ధి ఎజెండాతో పనిచేసే ప్రభుత్వాలకు ఓటు వేయాలి అని తన వాదనను వినిపిస్తుంటాడు. తాజాగా ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలు, ఓటర్ల తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం లేహ్, లడఖ్ ప్రాంతంలో ఓ నిరసన బృందానికి సపోర్ట్ చేస్తూ ఆయన తన పుట్టిన రోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆ పోస్టు చేసిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోతోపాటు ఆయన చెప్పిన కొన్ని ఇంటర్వ్వూలు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..
గతంలో ఓ ఇంటర్వ్యూలో.. ప్రభుత్వాలు యదేచ్ఛగా అక్రమాలతో రాజ్యమేలుతున్నాయంటే కారణం వారికి ఓట్లు వేసిన వారి వల్ల కాదు. చాలా మంది వారిని ప్రశ్నించకుండా మౌనంగా ఉండటమే. తప్పు చేసిన వారిని చరిత్ర క్షమించవచ్చేమో గానీ.. సైలెన్స్‌గా ఉన్న వారిని హిస్టరీ ఎప్పుడూ క్షమించదు అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

ప్రభుత్వాలను సినీ నటులు ప్రశ్నించాలని నేను చెప్పను. కానీ దేశం గురించి ఆలోచన, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను చూసి సిగ్గు పడేలా మనస్తత్వం ఉన్నవారికి, దేశాభివృద్దికి బాధ్యత కలిగిన పౌరులను నేను ప్రశ్నించమని అడగను. అబద్దాలను చెప్పమని కోరను. కానీ వాస్తవం చెప్పకుండా మౌనంగా ఉండకూడదని అంటాను అని ప్రకాశ్ రాజ్ అన్నారు.
సినీ తారలు వివిధ రకాల జీవితాలను చూస్తుంటారు. సగటు ప్రజలు చేయలేని పనులు వారికి చేసే సత్తా ఉంది. కాబట్టి వారికి సమాజం పట్ల స్పృహ ఉండాలి. బాధ్యత ఉండాలి. నేను ఈ విషయంలో మౌనంగా ఉండను. సమాజం పట్ల బాధ్యతతో నేను నా వంతుగా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

వ్యవస్థలోని లోపాలు, ప్రభుత్వాల పనితీరును నేను ప్రశ్నించడం చూసి మీకు ఎందుకు ప్రకాశ్ రాజ్ అంటారు. మీరు నటులు.. మీకు మంచి ఆధాయం ఉంది. మీరు బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అని సూచనలు, సలహాలు ఇస్తుంటారు. కానీ నేను ఓ వింత మనిషిగా నేను ఈ భూమ్మీద మరణించదలచుకోలేదు. అబద్దాలు ఆడుతూ బతకలేను. నేను మనిషిగా చచ్చిపోయిన తర్వాత నాకు మరణించడం ఇష్టం లేదు. డబ్బు సంపాదించే వ్యక్తిగా, యాక్టర్‌గా కాకుండా.. నేను ఓ సిద్దాంతం, విజన్ కోసం బతికే మనిషిగా చనిపోవాలని అనుకొంటున్నాను అని ప్రకాశ్ రాజ్ ఆవేదన చెందారు.
మార్చి 26 ప్రకాశ్ రాజ్ పుట్టిన రోజు. ఆయన బర్త్ డేను లేహ్ ప్రాంతంలో జరుపుకొంటున్నారు. దేశం కోసం ఫైటింగ్ చేస్తున్న ప్రజలు, వాంగ్ చుక్ బృందంతో కలిసి తన పుట్టిన రోజును గడిపేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆ ప్రాంతంలో నిరసన చేస్తున్న వారితో కలిసి ఉన్న వీడియోను షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











