twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోలైనా, ఎవరైనా పద్దతి మార్చుకోకపోతే కష్టాలే.. రేటింగ్స్ బుల్‌షిట్.. ప్రకాశ్ రాజ్ ఆవేదన

    |

    కరోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడం ఖాయం. జూన్, జూలైలో కూడా షూటింగ్‌లు ప్రారంభమవుతాయో చెప్పలేం. ఈ ప్రభావం మరో రెండేళ్లు చిత్ర పరిశ్రమపై ఉంటుంది. ఇలాంటి తరుణంలో సినీ పరిశ్రమపై ఆధారపడిన ఆర్ట్, మేకప్, లైటింగ్ విభాగంలోని వేతన కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ముందు సినీ కార్మికులు ఆకలితో ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.

    ఎన్నికలు వద్దని మందలించా

    ఎన్నికలు వద్దని మందలించా

    కొద్దిరోజుల క్రితం తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి కాల్ చేసి సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నికల గురించి చర్చించడం మొదలు పెట్టడంతో నాకు అసహనం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల గురించి ఆలోచించవద్దు. సినీ పరిశ్రమపై ఆధారపడిన రోజువారీ కార్మికుల బాగోగుల గురించి ఆలోచించాలి అని గట్టిగా మందలించాను అని ప్రకాశ్ రాజ్ చెప్పారు.

    బడ్జెట్‌లు, ఇతర విషయాలపై సమీక్ష అవసరం

    బడ్జెట్‌లు, ఇతర విషయాలపై సమీక్ష అవసరం

    ప్యాన్ ఇండియా మూవీస్, భారీ బడ్జెట్ సినిమాల విషయంలో మరోసారి పునరించుకోవాల్సి ఉందా అనే ప్రశ్నకు ప్రకాశ్ రాజ్ సమాధానం ఇస్తూ.. ఎవరైనా పరిస్థితులను బట్టి మారాల్సిందే. మారకపోతే వారే కష్టాలకు గురి అవుతారు. ప్రకృతికి విరుద్ధంగా వెళ్లకూడదు. ఎవరైనా అలా బిహేవ్ చేస్తే ప్రకృతే గుణపాఠం నేర్పుతుంది. కరోనా లాంటి వైరస్‌కు కులం, సెలబ్రిటీలు, పేద, ధనికులనే తేడా లేదు అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.

    లాక్‌డౌన్ తర్వాత ఏంటనేది

    లాక్‌డౌన్ తర్వాత ఏంటనేది

    సినీ కార్మికులను ఆదుకోవడానికి చిరంజీవి, మహేష్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి వాళ్లు ముందుకు రావడం అభినందనీయం. లాక్‌డౌన్ తర్వాత కార్మికుల పరిస్థితి ఏమిటనేది ఆలోచించాలి. భవిష్యత్‌లో ఇలాంటి సమస్యలు వస్తే ఏం చేయాలి? రానున్న 6 నెలల్లో ఏం చేయాలి అనే విషయాలపై దృష్టిపెట్టాలి అని ప్రకాశ్ రాజ్ సూచించారు.

     మార్పులకు సిద్ధంగా ఉండాలి

    మార్పులకు సిద్ధంగా ఉండాలి

    ప్రస్తుత సంక్షోభంలో రెమ్యునరేషన్ల విషయంపై ఎవరైనా పునరాలోచించుకోవాలి. ప్రస్తుతం ఎవరి అర్హత ప్రకారం వారు పారితోషికం అందుకొంటున్నారు. పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకోకపోతే ఎవరికైనా కష్టాలే ఉంటాయి. నేను కూడా అలాంటి మార్పులకు సిద్ధంగా ఉన్నాను అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

    Recommended Video

    Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie
    రేటింగులు కాదు.. మనిషి కష్టాల్లో లేకుండా చూడాలి

    రేటింగులు కాదు.. మనిషి కష్టాల్లో లేకుండా చూడాలి

    కరోనాను అరికట్టడంలో ప్రధాని మోదీ ప్రపంచదేశాల్లో ముందున్నారని, ఆయనకు 68 శాతం రేటింగ్ ఇచ్చారనే ప్రశ్నపై స్పందిస్తూ.. రేటింగులన్నీ బుల్ షిట్. నీ ఇంటి పక్కన వలస కార్మికుడెవరైనా కష్టపడుతున్నాడా? లేదా అనే విషయాన్ని చూడాలి. మనిషనే వాడు కష్టపడకుండా చూడటమే మంచి రేటింగ్. సమాజంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆలోచించాలి. సాటి మనిషి కష్టాల్లో లేకుండా చూడాలి. అప్పుడే మన పాలన విధానానికి ప్రజల గుర్తింపు లభిస్తుంది అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

    English summary
    Actor Prakash Raj comments about film industry crisis after lockdown. Prakash Raj said that everyone has to think about their strategy after lockdown amid corona crisis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X