Chandrayaan 3 నటుడు ప్రకాశ్ రాజ్‌పై కేసు.. చంద్రయాన్‌ 3 ప్రయోగంపై వివాదాస్పద ట్వీట్!

చంద్రయాన్ 3 ప్రయోగంపై అనుచిత, అసందర్భ వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రకాశ్ రాజ్‌కు భారీగా ఎదురు దెబ్బ తగిలింది. దేశానికి ఎంతో గర్వకారణమైన అంతరిక్ష ప్రయోగాన్ని కించపరిచే విధంగా తనదైన శైలిలో స్పందించిన ఆయనకు X (ట్విట్టర్)‌లో భారీ ప్రతికూలత ఎదురవుతున్నది. పలువురు ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంలో భాగంగా ప్రకాశ్ రాజ్‌పై పోలీసు కేసు కూడా నమోదైంది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ 2 అంతరిక్ష నౌక చంద్రుడిపై ఆగస్టు 23వ తేదీన ల్యాండ్ కానున్నది. భారతీయ కాలమానం ప్రకారం 18.04 గంటలకు చంద్ర మండలంలో అడుగుపెట్టే అద్బుతమైన క్షణాలను నేరుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఇస్రో వెబ్ సైట్, యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం కానున్నది.

 Actor Prakash Raj faces Police Case in Bagalkot district over remarks on ISROs Chandrayaan 3

చంద్రమండలంపై చంద్రయాన్ 2 అంతరిక్ష నౌక ల్యాండ్ అవుతున్న నేపథ్యంపై నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. చొక్కా, లుంగీ ధరించిన ఓ మనిషి ఛాయ్ పై నుంచి కిందకు పోస్తూ ఉన్న క్యారికేచర్ ఫోటోను ట్వీట్ చేశారు. చంద్రయాన్ పంపిన ఫస్ట్ ఫోటో చూడండి అంటూ కామెంట్ పెట్టారు. ప్రధాని మోదీ టార్గెట్‌గా ఈ ఫోటోను ప్రకాశ్ రాజ్ షేర్ చేశారనే విషయం విదితమే.

అయితే ప్రకాశ్ రాజ్ X సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో, కామెంట్‌పై దుమారం రేగింది. చాలా మంది ప్రకాశ్ రాజ్ తీరును ఆయన ఎండగట్టారు. ఇలాంటి అపూర్వ, అద్బుత సమయంలో ఇలాంటి పోస్టు పెట్టడం సబబు కాదు అంటూ ట్రోల్స్ చేశారు. అయితే తనపై ప్రతికూల కామెంట్లు రావడంతో ట్విట్టర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు.

అయితే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన ప్రకాశ్ రాజ్‌పై కర్ణాటకలో కేసు నమోదైంది. భాగల్‌కోట్ జిల్లాలోని బానాహట్టి పోలీస్ స్టేషన్‌లో కొందరు ఫిర్యాదు చేశారు. చంద్రయాన్ 3పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్‌పై హిందూ మత సంస్థలకు చెందిన కొందరు చేసిన ఫిర్యాదును స్వీకరించాం. ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆ ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశాం అని పోలీసులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X