twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎంపీగా నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్, అతడికి ఏం అర్హత ఉందంటూ..

    |

    బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన శుక్రవారం బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

    నామినేషన్ వేసిన అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు ప్రజల్లో విఫలం అయ్యాయని, జనం గొంతు పార్లమెంటులో వినిపించాలనే లక్ష్యంతో స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు.

    ప్రకాష్ రాజ్

    ప్రకాష్ రాజ్

    ప్రకాష్ రాజ్ కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా తన గళం విప్పుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక సమస్యలపై మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తన స్నేహితురాలు, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై న్యాయం కోరుతూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి.

    ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఒక పండగ

    ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఒక పండగ

    ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది పండగ. ఓటు అనేది ఒక పేపర్ ముక్క కాదు. దాని ద్వారా మన హక్కు, మన ఆలోచన, దేశం మీద మనకు ఉన్న ప్రేమ, మనం ఎవరిని ఎన్నుకుంటున్నామని చెప్పే ఒక సాధనం. ఇలాంటి పండుగలో నేను భాగం కావడం, నా వెనక ఇంత మంది రావడం ఆనందంగా ఉంది. వారిని లక్షలు ఖర్చు పుట్టి డబ్బుతో తీసుకురాలేదు. యువత, మహిళల మద్దతు నాకు ఉంది. వారి తరుపున పార్లమెంటులో ఒక గొంతు వినిపించాలనే నేను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత దేశంలో మార్పు వస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.

    అడ్డంగా బుక్కైన ప్రకాష్ రాజ్.. పోలిసుల వద్ద ఆధారాలు!అడ్డంగా బుక్కైన ప్రకాష్ రాజ్.. పోలిసుల వద్ద ఆధారాలు!

    బెంగుళూరు సెంట్రల్

    బెంగుళూరు సెంట్రల్

    బెంగుళూరు సెంట్రల్ నుంచి... బీజేపీ తరుపున సిట్టింగ్ ఎంపీ పిసి మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ప్రకాష్ రాజ్‌కు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

    అతడికి ఏం అర్హత ఉంది?

    అతడికి ఏం అర్హత ఉంది?

    మాండ్య నుంచి సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేస్తున్నారు. అర్హత ఉన్న వారు పోటీ చేయాలనేది నా అభిప్రాయం. అతడికి ఏం తెలుసు? మొన్ననే సినిమాల్లోకి వచ్చాడు.. అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత నాకు చాలా కాలంగా తెలుసు. ఆమెకు రాజకీయాలపై మంచి అవగాహన ఉందన్నారు ప్రకాష్ రాజ్.

    English summary
    Actor Prakash Raj on Friday filed his nomination to contest the Lok Sabha elections from Bangalore Central constituency as an Independent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X