నాలుగు ప్లాట్స్ ని గిప్ట్ గా ఇచ్చిన ప్రకాష్ రాజ్
కాంట్రావర్శీ నటుడుగా పేరొందిన ప్రకాష్ రాజ్ మంచి హ్యూమన్ బీయింగ్ గానూ చెప్తారు. ఆయన తాజాగా తన స్టాఫ్ లోని నలుగురుకు ప్లాట్స్ కొని ఇచ్చి ఆనందపరిచారు. హైదరాబాద్ మణికొండ ఏరియాలో ఓ అపార్టమెంట్ లో ఈ ప్టాట్స్ ని కొనుగోలు చేసాడని సమాచారం. ఇక నటన జీవితానికే కాక వ్యక్తిగత జీవితానికి సైతం ప్రయారిటీ ఇచ్చే ప్రకాష్ రాజ్ గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా చెప్పుకుంటున్నారు.
ఇక ప్రస్తుతం నటుడుగా ప్రకాష్ రాజ్ పూర్తి బిజీగా ఉన్నారు. పూరీ జగన్నాధ్ బద్రీలో ప్రకాష్ రాజ్,పవన్ కళ్యాణ్ ఇద్దరూ పోటా పోటీగా ..నందా..నందా..నందా అంటే...నువ్వు నందావైతే నేను బద్రీ..బద్రీనాధ్ అంటూ చెప్పిన డైలాగులు ఎవరూ మర్చిపోరు. మళ్లీ వీరిద్దరూ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందే 'కెమెరామేన్ గంగతో రాంబాబు'లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో విలన్ గా ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడని సమాచారం. ప్రత్యేకమైన మ్యానరిజంతో ప్రకాష్ రాజ్ పాత్రను తీర్చిదిద్దాడని,అది విన్న ప్రకాష్ రాజ్ వెంటనే ఓకే చేసాడని చెప్తున్నారు.
స్క్రిప్టు విన్న ప్రకాష్ రాజ్...ఈ మధ్య కాలంలో నేను విన్న స్క్రిప్టులో బెస్ట్ స్క్రిప్టు ఇది..చాలా నిజాయితీగా ఉంది. నా కెరీర్ లో మరో పేరు తెచ్చి పెట్టే పాత్ర అవుతుంది అన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు గా కనిపిస్తారు. ఈ చిత్రాన్ని అక్టోబరు 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని పూరీ చెప్పారు.
అలాగే ఈ చిత్రంతో పాటు ఆయన తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబ నేపథ్యంలో సాగే కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కథలో భావోద్వేగాలు అందరినీ కదిలిస్తాయి. వెంకటేష్, మహేష్‌బాబుల పాత్రలు అందరికీ గుర్తుండిపోతాయి. సీత పాత్ర కథలో చాలా కీలకం. ప్రకాష్‌రాజ్ మరోసారి ఓ ఉదాత్తమైన పాత్రలో కనిపిస్తారు. మల్టీస్టారర్ చిత్రాలకు ఈ సినిమా నాంది అవుతుంది.


Click it and Unblock the Notifications











