స్నేహితురాలి హత్య.. నూతన సంవత్సరంలో ప్రకాష్ రాజ్ సంచలన నిర్ణయం!

Recommended Video

New Year 2019 Updates:Actor Prakash Raj To Enter Into Politics

విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. విలన్ పాత్ర అయినా, క్యారెక్టర్ రోల్ అయినా అద్భుతంగా నటించి ప్రేక్షకులని మెప్పిస్తారు. ప్రకాష్ రాజ్ కు నటుడిగా సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. ఓ సందర్భంలో సౌత్ లో అత్యధిక పారితోషకం అందుకునే నటుడిగా ప్రకాష్ రాజ్ కొనసాగారు. ఇదిలా ఉండగా ప్రకాష్ రాజ్ నూతన సంవత్సరం సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రకాష్ రాజ్ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించారు.

సార్వత్రిక ఎన్నికల బరిలో

సార్వత్రిక ఎన్నికల బరిలో

నూతన సంవత్సరం సందర్భంగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేస్తూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా తాను బరిలో దిగబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చిన ప్రకాష్ రాజ్ తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. దీనితో ప్రకాష్ రాజ్ ప్రత్యక్ష యుద్ధానికే దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాను స్వతంత్ర అభ్యర్థి ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని ప్రకాష్ రాజ్ తెలిపారు.

 కారణం ఇదే

కారణం ఇదే

తన స్నేహితురాలు, జర్నలిస్ట్ అయిన గౌరి లంకేశ్ హత్యకు గురైన తర్వాత ప్రకాష్ రాజ్ బాగా కలత చెందారు. గౌరి లంకేశ్ హత్య వెనుక హిందూ అతివాదులు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2017 సెప్టెంబర్ లో గౌరి లంకేశ్ హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనే నిర్ణయం వెనుక గౌరి లంకేశ్ హత్యే కారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి.

 పలు వేదికలపై

పలు వేదికలపై

ప్రకాష్ రాజ్ పలు వేదికలపై ఇండియాలో ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ అంశాల గురించి మాట్లాడారు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలని నేరుగా తప్పుబట్టారు. ప్రకాష్ రాజ్ తాజా రాజకీయ నిర్ణయానికి నెటిజన్ల నుంచి అనుకూల స్పందన వస్తోంది. ప్రకాష్ రాజ్ కు ముందస్తుగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నటుడిగా బిజీ

నటుడిగా బిజీ

ప్రకాష్ రాజ్ ఇప్పటికి సౌత్ లో నటుడిగా బిజీగా కొనసాగుతున్నాడు. చాలా చిత్రాల్లో ప్రకాష్ రాజ్ నటన హైలైట్ గా నిలిచింది. ప్రకాష్ రాజ్ సొంత రాష్ట్రం కర్ణాటక. కర్ణాటకలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ప్రకాష్ రాజ్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఇప్పటికే హాట్ హాట్ గా చర్చ మొదలయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X