twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bhagat Singh Nagar: అలా ప్రస్తావించడం బాగాలేదు.. దర్శకుడిపై ప్రకాష్ రాజ్ అసహనం

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా పోటీకి సిద్ధమవుతున్న విలక్ష నటుడు ప్రకాశ్ రాజ్ పలు సినిమా వేడుకల్లో బిజీగా మారుతున్నారు. తాజాగా గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు నిర్మిస్తున్న చిత్రం భగత్ సింగ్ నగర్ టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఆడియో విజువల్ వీడియోలో తన పోటీ గురించి ప్రస్తావించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ఎంతో మంది దర్శకులతో

    ఎంతో మంది దర్శకులతో

    ఈ వేడుకలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. నా 30 ఏళ్ల సినీజీవితంలో ఎంతో మంది దర్శకులతో పని చేశాను. ఆ దర్శకులు నాలోని ప్రతిభను గుర్తించి నన్ను మంచి నటుడిగా తయారు చేశారు. కాబట్టే ప్రకాశ్ రాజ్ ఈ వేదికపై ఉన్నారు. నన్ను తీర్చి దిద్దిన దర్శకులందరికీ నా ధన్యవాదాలు అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

    అలా క్లిప్పింగ్ ప్రదర్శించడం తప్పు

    అలా క్లిప్పింగ్ ప్రదర్శించడం తప్పు

    నా ప్రొఫెషనల్ జీవితం గురించి, నా గురించి ఆడియో విజువల్ వీడియోలో చెప్పడం చాలా బాగుంది. కానీ నా అనుమతి లేకుండా మా అసోసియేషన్ కోసం పోటీ చేస్తున్న క్లిప్పింగ్‌ను ప్రదర్శించడం తప్పు. సినిమా వేడుకను సినిమాగానే చూద్దాలి. నేను మీరు చేసే మంచి ప్రయత్నానికి సపోర్ట్ చేయడానికి వచ్చాను. కానీ సినిమాకు సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం బాగలేదు. వీలుంటే మీడియా ఆ వీడియో క్లిప్పింగ్‌ను తీసివేయాలని కోరుతున్నానను అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

    భగత్ సింగ్ బతికి ఉంటే..

    భగత్ సింగ్ బతికి ఉంటే..

    భగత్ సింగ్ నగర్ టీజర్ ఆవిష్కరణలో ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ అయ్యారు. భగత్ సింగ్ అన్నా.. ఆయన పోరాట పటిమ అన్నా అంటే నాకు చాలా ఇష్టం. ఆయనే కనుక ఎక్కువ కాలం బతికి ఉంటే ఈ దేశం పరిస్థితి ఇలా ఉండేది కాదు. దేశానికి మరో చెగువేరా అంతటి మహానుభావుడు అయ్యేవారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆలోచనతో సినిమా తీస్తున్నారని తెలియగానే పిలిచి మాట్లాడాను. దర్శకుడు క్రాంతి మంచి కథను సెలెక్ట్ చేసుకొన్నాడు. ఇలాంటి మంచి సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలను చూసి నేను గర్వపడుతున్నాను అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

    ప్రకాశ్ రాజ్‌తో స్టేజ్ షేర్ చేసుకోవడం

    ప్రకాశ్ రాజ్‌తో స్టేజ్ షేర్ చేసుకోవడం

    భగత్ సింగ్ నగర్ టీజర్ ఆవిష్కరణలో దర్శకుడు వాలాజా క్రాంతి, దర్శకుడు బాబ్జీ, సంగీత దర్శకుడు ప్రభాకర్, హీరో విదార్ధ్, హీరోయిన్ ధృవీక తదితరులు మాట్లాడారు. లెజండరీ యాక్టర్ ప్రకాశ్ రాజ్‌తో స్టేజ్ షేర్ చేసుకొంటానని ఎప్పుడూ ఊహించలేదు. మా సినిమా టీజర్‌ను ప్రకాశ్ రాజ్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. భగత్ సింగ్ నగర్ ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ అని దర్శకుడు వాలాజా క్రాంతి అన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యాన్ని మన దేశ పొలిమేరల వరకు తరిమి కొట్టి చిరు ప్రాయంలోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్. తను చనిపోయిన మార్చి 23వ ఈ కుటుంబమంతా ఉపవాసం ఉంటుంది అని దర్శకుడు బాబ్జి అన్నారు.

    సినిమా విజయం సాధించాలంటూ

    సినిమా విజయం సాధించాలంటూ

    భగత్ సింగ్ నగర్ టీజర్ కార్యక్రమంలో ఇంకా దర్శకుడు వీరభద్రం , దర్శకుడు చిన్ని కృష్ణ, దర్శకుడు చంద్ర మహేష్ , దర్శకుడు బాబ్జి, నువ్వు తోపురా నిర్మాత శ్రీకాంత్, బట్టల రామస్వామి నిర్మాత సతీష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెలిదొండ వెంకటేష్ ,యూసుఫ్ గూడ ఎక్స్ కార్పొరేటర్ సంతోష్, చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ దర్శక,నిర్మాతలు చేసే గొప్ప ప్రయయత్నాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి సినిమా గొప్ప విజయం సాధించేలా చేయాలని అన్నారు.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ ఘోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్ తదితరులు
    ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి
    ఎడిటింగ్: జియాన్ శ్రీకాంత్
    స్టిల్స్: మునిచంద్ర
    కొరియోగ్రఫి: ప్రేమ్-గోపి
    మ్యూజిక్: ప్రభాకర్ దమ్ముగారి=
    ప్రొడ్యూసర్స్: వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు
    కథ, కథనం, దర్శకత్వం: వాలాజా క్రాంతి
    పిఆర్వో: మధు వీఆర్

    English summary
    Actor Prakash Raj at Bhagat Singh Nagar Teaser event. In this event, Unit screened a AV on Prakash Raj. But Prakash Raj not happy on some incidents which are in AV.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X