twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోడీనా.. ఎవరాయన.. 6 నెలల తర్వాత చూడండి ఏం జరుగుతుందో.. ప్రకాష్ రాజ్!

    |

    Recommended Video

    Actor Prakash Raj Again Makes Controversial Comments On Modi | Oneindia Telugu

    విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయ పరమైన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రకాష్ రాజ్ భారత ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించే చేసే ప్రతి విమర్శ నేషనల్ మీడియాలో హైలైట్ అవుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రకాష్ రాజ్ తన పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేశారు. తాను రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. అప్పటి నుంచి నరేంద్ర మోడీపై మరింతగా విమర్శల దూకుడు పెంచారు. తాజాగా ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదభరితంగా మారుతున్నాయి.

     కేజ్రీవాల్ సహకారంతో

    కేజ్రీవాల్ సహకారంతో

    ప్రకాష్ రాజ్ వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహకారంతో బరిలోకి దిగబోతున్న విషయం ఖరారైంది. తాను ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. తన పోటీని బిజెపి అడ్డుకోలేదని అన్నారు. కేజ్రీవాల్ తో ఆలోచన విధానాలు నాకు నచ్చాయి. అందుకే వారితో కలసి ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. లౌకికవాద విధానాలు ఉన్నా ఏ పార్టీ అయినా నాకు మద్దత్తు తెలపవచ్చు. కానీ ఎదో ఒకపార్టీలో చేరమని మాత్రం తనని బలవంతం చేయవద్దని ప్రకాష్ రాజ్ అన్నారు.

    6 నెలల తర్వాత చూడండి

    6 నెలల తర్వాత చూడండి

    గత ఏడాది కాలంగా ప్రకాష్ రాజ్ మోడీపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. నేను రాజకీయాల్లోకి వచ్చింది మోడీపై వ్యక్తిరేకతతో కాదు. అసలు మోడీ ఎవరు.. 6 నెలల తర్వాత చూడింది.. మోడీ కేవలం ఒక ఎంపీగా మాత్రమే ఉంటారు అని ప్రకాష్ రాజ్ వివాదభరిత వ్యాఖ్యలు చేసారు. మోడీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత గౌరవించానని ప్రకాష్ రాజ్ అన్నారు. ఏదైనా మార్పు తీసుకొస్తారని ఆశించినట్లు ప్రకాష్ రాజ్ అభిప్రాయ పడ్డారు.

    మోడి వచ్చాక ఏం జరిగింది

    మోడి వచ్చాక ఏం జరిగింది

    మోడీ ప్రధాని అయ్యాక తీసుకు వచ్చిన విధానాలని ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. నోట్ల రద్దు వలన ప్రజలకు ఒరిగింది ఏంటి.. జీఎస్టీ తీసుకుని వచ్చారు.. ఆ తర్వాత 200 సార్లు దానిని మార్చారు అని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. జిఎస్టీని నేను తప్పుబట్టడం లేదు. కానీ సరైన ప్లానింగ్ లేకుండా అమలు చేశారని ప్రకాష్ రాజ్ అన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రజల జీవితాలతో ప్రయోగాలు చేస్తోందని ప్రకాష్ రాజ్ విమర్శించారు.

     బెంగుళూరు సెంట్రల్

    బెంగుళూరు సెంట్రల్

    బెంగుళూరు సెంట్రల్ ఒక మినీ ఇండియా లాంటిది. అక్కడ హిందువుల, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, దళితులు అందురూ ఉంటారు. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగులు ఇలా పలు భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు. అందుకే తాను బెంగుళూరు సెంట్రల్ నుంచి పోటీ చేయాలనీ నిర్ణయించుకున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు. నిరుద్యోగ అంశం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొస్తున్న విధానాలు బావున్నాయని ప్రశంసించారు.

    English summary
    After six months, PM Narendra Modi will be just another MP: Prakash Raj
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X