twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకాశ్ రాజ్‌కు చేదు అనుభవం.. పరాయి వ్యక్తి భార్యతో సెల్ఫీ.. కశ్మీర్‌లో నానా యాగీ!

    |

    భారతదేశంలో ఉన్న విలక్షణ నటుల్లో ప్రకాశ్ రాజ్ ఒకరు. భాషతో సంబంధం లేకుండా ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. దాదాపుగా అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి అవార్డులు అందుకున్నారు. అంతేకాదు, ఆయనలో ఉన్న మరో కోణమే ప్రకాశ్ రాజ్ అంటే ఎవరో సమాజానికి చూపింది. అదే.. ఆయనలోని పొలిటికల్ యాంగిల్. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే ప్రకాశ్ రాజ్.. ఎన్నో సందర్భాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందించారు. ఒకానొక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీతో సైతం కయ్యానికి కాలు దువ్వారు. అందుకే ఆయనంటే మోదీ ఫాలోవర్స్‌కు నచ్చదు. దీనికి ఉదాహరణగా పేర్కొంటూ ఇటీవల జరిగిన ఓ ఘటనను ఆయన తన అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ చర్చనీయాంశం అవుతోంది.

     కశ్మీర్ పర్యటనలో ప్రకాశ్ రాజ్

    కశ్మీర్ పర్యటనలో ప్రకాశ్ రాజ్

    ఇటీవల వేసవి విడిది కోసం ప్రకాశ్ రాజ్ కశ్మీర్‌లో పర్యటించారు. ఆ సమయంలో ఎవరో మహిళ, ఆమె కుమార్తె తనతో ఫొటో దిగేందుకు వచ్చారని, అంతలోనే మోదీ ఫాలోవర్ అయిన ఆమె భర్త వచ్చి నానా యాగి చేశాడని చెప్పారు. ‘‘నేను కాశ్మీర్‌లోని గుల్మర్గ్‌లో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇంతలో ఓ మహిళ, ఆమె కూతురు వచ్చి నన్ను సెల్ఫీ అడిగారు. దానికి నేను అంగీకరించాను. దీంతో వారు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

     తల్లి, కూతుళ్లతో ఫొటో దిగితే

    తల్లి, కూతుళ్లతో ఫొటో దిగితే

    తల్లి, కూతుళ్లతో ఫోటో దిగిన తర్వాత అసలు గొడవ మొదలైంది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. నా ముందే ఆమెతో గొడవకు దిగాడు. ఆ ఫొటోను డిలీట్ చేయమని రాద్దాంతం చేశాడు. దీనికి కారణం కేవలం నేను ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడమే. అతడు చేస్తున్న గొడవను చుట్టూ ఉన్న పర్యాటకులు సైతం చూశారు. దీంతో సదరు మహిళ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో నేను అతడిని పక్కకు తీసుకెళ్లి సముదాయించాను అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

    మంచి జీవితాన్ని పంచండి అని

    మంచి జీవితాన్ని పంచండి అని

    నాకో, మోదీకో కాదు.. మీరు ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు, మీ అందమైన కుమార్తెకు జీవితాన్ని పంచండి. మీ మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. టూర్‌ను ఎంజాయ్ చేయండి అన్నాను. దీంతో అతడు మాట్లాడకుండా ఉండిపోయాడు. అతడు ఫొటోను డిలీట్ చేయొచ్చు.. చేయకపోవచ్చు.. వాళ్ల మనసును మాత్రం గాయపరిచాడు. దీంతో నేను కూడా బరువైన హృదయంతో అక్కడి నుంచి వచ్చేశాను'' అని జరిగిన దానిని వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

    ప్రధాని మోదీపై పలుమార్లు ఫైర్

    ప్రధాని మోదీపై పలుమార్లు ఫైర్

    ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పలు సంస్కరణలు, గౌరీ లంకేష్ హత్య సహా పలు విషయాల్లో ప్రకాశ్ రాజ్ ధీటుగా స్పందించారు. సోషల్ మీడియాలోనే కాదు.. ఎన్నో వేదికలపై కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగేవారు. ఈ క్రమంలోనే ఆయన బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు.

    English summary
    Prakash Raj is one of the few actors who is vocal about his political opinions. On June 15, he took to Twitter to share an unpleasant incident that took place when a lady and her daughter wanted to take a photo with him in Gulmarg, Kashmir. He revealed that the encounter has made him think about a lot of things.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X