మామిడి కాయలు అమ్మిన ప్రకాష్ రాజ్ కొడుకు.. లాక్‌డౌన్ సమయంలో తండ్రితో..

ఆ భాష.. ఈ భాష అనే తేడా లేకుండా దాదాపు అన్ని భాషల వారికి తెలిసిన నటుడు ప్రకాష్ రాజ్. సినిమాల్లో ఎక్కువగా విలన్స్ రోల్స్ లో నటించిన ఈ యాక్టర్ రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరోలా పనులు చేస్తుంటాడు. చాలా వరకు తన సంపాదనలో కొంత పేద జనాలకు ఉపయోగించడానికి ట్రై చేస్తుంటాడు. కరోనా లాక్ డౌన్ లో ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన కుమారుడితో కలిసి షాద్ నగర్‌కు సమీపంలోని ఫామ్‌హౌస్‌లో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ తనయుడు వేదాంత్ చేసిన పని అందర్నీ ఆకర్షించింది.. వివరాల్లోకి వెళితే..

దేశం నలువైపులా..

దేశం నలువైపులా..

కరోనా దెబ్బకు చాలా మంది ఉపాధి కోల్పోయారు. అయితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్స్ తో జనాలను ఉత్తేజపరుస్తూ తన దగ్గర లేకపోయినా ఆర్థిక సహాయం చేస్తున్నాడు. దేశం నలువైపులా ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన పేదలకు సాయం చేస్తున్నారు. అలాగే పేద కళాకారులకు కూడా ప్రకాష్ రాజ్ సహాయం అందిస్తున్నారు.

మామిడి తోటలో తనయుడు..

ప్రకాష్ రాజ్ చిన్న కుమారుడు వేదాంత్ కి సంబంధించిన ఒక స్పెషల్ ఫోటోని ప్రకాష్ రాజ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మామిడి తోటలో తన కుమారుడు మ్యాంగో సెల్లర్ గా మారాడు అంటూ ఫార్మ్ లో నేచర్ మధ్యలో ఇలా సరదాగా గడుపుతున్నట్లు వివరణ ఇచ్చారు. వేదాంత్ కూల్ గా మామిడి కాయలను ప్యాక్ చేస్తున్నట్లున్న ఆ ఫోటోలో కనిపించడం నెటీజన్స్ ని ఆకట్టుకుంటోంది.

తండ్రికి తగ్గ తనయుడు..

తండ్రికి తగ్గ తనయుడు..

చూస్తుంటే వేదాంత్ కూడా ప్రకాష్ రాజ్ చేస్తున్న సాయంలో తనవంతు కృషిగా డబ్బు ఈ విధంగా కలెక్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఒక వైపు డబ్బు లేకపోయినా ప్రకాష్ రాజ్ బ్యాంక్ లోన్ తీసుకొని కరోనా బాధితులకు అండగా ఉండేందుకు కృషి చేస్తున్నారు. అవసరమైతే స్టార్ హీరోల దగ్గర కూడా అప్పులు తీసుకొని సినిమాలు వచ్చిన తరువాత మళ్ళీ వాళ్ళ డబ్బు వాళ్లకు ఇచ్చేస్తానని కూడా అన్నారు.

Recommended Video

Vijay Sethupathi Out From Allu Arjun's Pushpa Movie
ఇప్పుడే హ్యాపీగా ఉంది..

ఇప్పుడే హ్యాపీగా ఉంది..

లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చిన ప్రకాష్ రాజ్ పూర్తిగా తన ఫామ్ హౌజ్ లోనే కుటుంబంతోనే కాలాన్ని గడుపుతున్నారు. అలాగే ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ద్వారా జనాలకు సహాయం అందిస్తూ కాస్త బిజీగా..గడుపుతున్నప్పటికి ఫ్యామిలీకి దగ్గరగా ఉండటం బావుందని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మెయిన్ గా షూటింగ్ ల కోసం వివిధ ప్రాంతాలకు తిరిగేవాడిని ఇప్పుడు ఒకే చోట ప్రశాంతంగా ఉన్నట్లు వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X