ప్రధాని మోదీని దారుణంగా టార్గెట్ చేసిన ప్రకాశ్ రాజ్.. ఆ ఇద్దరితో పోల్చుతూ సెటైర్లు!
వీలు చిక్కితే ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై సెటైర్లు వేయడంలో నటుడు ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ ముందుంటాడు. నోట్ల రద్దు కానీ, ఇంకా కేంద్రంలోని బీజేపీ అనుసరించే విధానాలను తూర్పార బట్టడంలో రాజీలేని పోరాటం చేస్తుంటాడు. దేశంలో ఎవరూ టార్గెట్ చేయని విధంగా #Justasking అంటూ ప్రధాని మోదీపై తీవ్రమైన పదజాలంతో దుయ్యబడుతుంటారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంట్ అనర్హత వేటు వేయడంపై ప్రకాశ్ రాజ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ తాజాగా మోదీ పేరున్న ముగ్గురు వ్యక్తులను టార్గెట్ చేస్తూ..
గతంలో రాహుల్ గాంధీ ఓ సభలో ప్రసంగిస్తూ.. మోదీ పేరున్న ప్రతీ ఒక్కరు దొంగలే అంటూ చేసిన వ్యాఖ్యలపై సూరత్‌లో పరువునష్టం దావా వేశారు. ఈ దావాను విచారించిన సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్షను విధించారు. దాంతో నేరప్రవత్తి, నేర చరిత్ర ఉన్నదనే ఆరోపణలతో రాహుల్ గాంధీపై పార్లమెంట్ సభ్యత్వాన్ని అనర్హతగా ప్రకటించింది. దాంతో ఎంపీగా అనర్హుడు అంటూ రాహుల్ గాంధీ సభ్యత్యంపై స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.

అయితే రాహుల్ గాంధీపై పార్లమెంట్ తీసుకొన్న నిర్ణయంపై ప్రకాశ్ రాజ్ తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. ప్రియమైన పౌరులారా.. ఇలాంటి రాజకీయాలను తలచుకొంటేనే సిగ్గు చేటుగా ఉంది. రాజకీయ వ్యవస్థ మొత్తం తిరోగమనం చెందుతున్నట్టు అనిపించింది. ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు చాలా వల్గర్. ఇలాంటి దారుణాలపై ప్రజలు మౌనం వహిస్తే.. ఇంకా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురువుతుంది. కాబట్టి ప్రజలంతా గొంతెత్తి నిరసన తెలియజేయాల్సిన సమయం వచ్చింది అని ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, మరోసారి ప్రధాని నరేంద్రమోదీని ప్రకాశ్ రాజ్ మరోసారి టార్గెట్ చేశారు. తాజాగా ట్విట్టర్‌లో జనరల్ నాలెడ్జి అంటూ పోస్టు పెట్టి.. లలిత్ మోదీ, నరేంద్రమోదీ, నీరవ్ మోదీ ఫోటో పెట్టి.. ఈ ముగ్గురిలో కామన్ విషయం ఏమిటో చెప్పగలరా... జస్ట్ ఆస్కింగ్ (#justasking) అంటూ కామెంట్ చేశారు. ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే నెటిజన్లు ప్రకాశ్ రాజ్ ట్వీట్‌పై స్పందిస్తూ.. మోదీజీ మన ప్రధాని. విమర్శించే హక్కు ప్రతీ భారతీయుడికి ఉంటుంది. కానీ ఆరోగ్యకరమైన విమర్శ ఉండాలి. కానీ దొంగలతో పోల్చుతూ మోదీని అవమానించేలా ఉండకూడదు. ప్రతీ విషయానికి ఓ పరిమితి ఉంటుంది. నేను బీజేపీ సపోర్టర్‌ను కాను. అయినప్పటికీ.. మోదీ మంచి లీడర్ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పగలను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
అయితే మొదటి వ్యక్తి మోసగాడు.. రెండోవ్యక్తి మహా మోసగాడు.. మూడో వ్యక్తి పదే పదే మోసాలు చేసే వ్యక్తి అంటూ కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











