హిట్టయిన మహేష్ బాబు సినిమాపై ప్రకాష్ రాజ్ అసంతృప్తి.. ఇష్టం లేకుండా నటించాను అంటూ..
నటనలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రకాష్ రాజ్ ఎలాంటి పాత్రలో కనిపించినా కూడా కచ్చితంగా దానికి న్యాయం చేస్తాడు అని ఇండస్ట్రీలో ఒక గట్టి నమ్మకం అయితే ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆయన పూర్తిగా కమర్షియల్ అంశాలతో కూడిన సినిమాల్లో నటించే విధానం ఓ వర్గం వారిని పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అదేమీ కూడా ప్రకాష్ రాజ్ కు పెద్దగా మైనస్ కాదు. అయినప్పటికీ కూడా ఆయన క్యారెక్టర్స్ ఎంచుకోవడంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు.
ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రకాష్ రాజ్ టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల ప్రకాష్ రాజ్, మహేష్ బాబు సినిమాలో చేసిన ఒక పాత్ర గురించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ పాత్ర నచ్చకపోయినా కూడా చేశాను అని ప్రకాష్ రాజ్ ఓపెన్ గానే వివరణ ఇచ్చారు.

ఆ సినిమా మరేదో కాదు మహేష్ బాబుకు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందించిన సరిలేరు నీకెవ్వరు సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఆ సినిమాలో మేయిన్ విలన్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఒక అన్యాయమైన పొలిటిషన్ గా ఆయన కనిపించిన విధానం పాత్ర వరకు బాగానే ఉంటుంది. అందులోనే సీరియస్ కామెడీ వెండితెరపై అద్భుతంగా వర్క్ అవుట్ అయింది.
కానీ ప్రకాష్ రాజ్ మాత్రం మా పాత్ర ఆ అయిష్టంగానే చేసినట్లుగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. అబద్ధపు మాటలు చెప్పి నమ్మించే రాజకీయ నాయకుడిగా అందులో తాను చేసిన పాత్ర ఏమాత్రం నచ్చలేదు అని సినిమా షూటింగ్ చేస్తున్నన్ని రోజులు కూడా ఇష్టం లేకుండానే నటించాను అని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. అయితే ఆ పాత్ర చేయడానికి గల కారణం కొన్ని సార్లు అనుకోకుండా ఏదో అనుకొని గ్రీన్ సిగ్నల్ ఇస్తామని కానీ వెండితెరపై చూసిన తర్వాత ఆ పాత్రంమ్ మరొక విధంగా ఉంటుంది అని ప్రకాష్ రాజ్ తన పొరపాటున తెలియజేశాడు. ఇక తన కెరీర్ మొత్తంలో చూసుకుంటే ఎక్కువగా సంతృప్తినిచ్చిన సినిమాల్లో బొమ్మరిల్లు, ఆకాశమంత నెంబర్ వన్ స్థానంలో ఉంటాయని అన్నారు.


Click it and Unblock the Notifications











