ఆసుపత్రిపాలైన ‘జంజీర్’ విలన్
ముంబై: అమితాబ్ హీరోగా వచ్చిన బాలీవుడ్ మూవీ 'జంజీర్' ఒరిజినల్ చిత్రంలో విలన్‌గా నటించిన ప్రాణ్ ఆసుపత్రి పాలయ్యారు. 92 సంవత్సరాల ప్రాణ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. పరిస్థితి కాస్త తీవ్రంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. జంజీర్, డాన్, కర్జ్ చిత్రాల్లో ప్రాణ్ తనదైన విలనీయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తాజాగా జంజీర్ చిత్రం రామ్ చరణ్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. 'జంజీర్ సినిమాతో రామ్‌చరణ్ బాలీవ్ఞడ్ రంగ ప్రవేశం చేస్తున్నాడు. జంజీర్ ఒరిజినల్ వెర్సన్ లో ప్రాణ్ పోషించిన విలన్ 'షేర్ ఖాన్' పాత్రను ఇందులో సంజయ్ దత్ చేస్తున్నాడు.
ఈ చిత్రంలో చెర్రీ సరసన ప్రియాంకా చోప్రా ఇందులో హీరోయిన్. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు సంచలనం స]ష్టించిన 'జంజీర్ సినిమా మళ్లీ రీమేక్ అవ్ఞతుండడంతో అందరిలో ఈ చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. నాటి జంజీర్ సినిమా తర్వాత అమితాబ్ ఇమేజ్ ఒక్కసారి గా మారిపోయింది. యాంగ్రీ యంగ్ మెన్ అంటూ అమితాబ్‌ను పిలవడం ప్రారంభించారు.
అమితాబ్ పాత్రకు అంత గుర్తిపు రావడానికి కారణం ప్రత్యర్థిగా కనిపించే షేర్‌ఖాన్ పాత్ర కు ప్రాణ్ అంతగా రక్తి కట్టించడమే. ఒకప్పటి జంజీర్‌లో ప్రధానంగా కనిపించే పాత్రలు రెండు ఒకటి విజయ్ (అమితాబ్), రెండు షేర్‌ఖాన్ (ప్రాణ్). జంజీర్ రీమేక్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమా హీరోగా తనకు మంచి పాపులారిటీని తీసుకు వస్తుందని ఆశిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











