స్నేహను పెళ్లి చేసుకోబోతున్నా: ప్రకటించిన హీరో

By Bojja Kumar

హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చకున్న నటి స్నేహ త్వరలో శ్రీమతి కాబోతోంది. తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకోబోతోంది. ఈ విషయాన్ని ఈ రోజు(నవంబర్ 9) ప్రసన్న అధికారికంగా ప్రకటించాడు. ఈ పెళ్లి వార్తను స్నేహ ధృవీకరించింది. 2009లో ఓ తమిళ సినిమాలో స్నేహ, ప్రసన్న కలిసి నటించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య ఎఫైర్ మొదలైందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఎట్టకేలకు ఈ జంట తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

పెళ్లి గురించి ప్రసన్న మీడియాతో మాట్లాడుతూ....'అవును మీడియాలో వస్తున్న వార్తలు నిజమే, నేను స్నేహను పెళ్లి చేసుకోబోతున్నాను, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం" అంటూ ప్రసన్న ప్రకటించారు. ఇంకా నిశ్చితార్థం తేదీ ఖరారు కాలేదని ప్రసన్న స్పష్టం చేశారు. త్వరలోనే నిశ్చితార్థం, పెళ్లి తేదీలను ప్రకటిస్తామన్నారు.

ప్రస్తుతం హీరోయిన్ స్నేహ...నాగార్జున హీరోగా రూపొందుతున్న రాజన్న సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర వర్మ దర్శకత్వం వహిస్తుండగా, రాజమౌళి కొన్ని యాక్షన్ సీన్లకు దర్శకత్వం వహించారు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X