ఆ హీరో ఎవడో, వాడి కోసం రాలేదు, పెద్ద తోపు అని ఫీలింగా: ప్రియదర్శి

Recommended Video

Actor Priyadarshi Funny Speech At '47 Days' Trailer Launch Event || Filmibeat Telugu

సత్య దేవ్, పూజా జవేరి, రోహిణి ప్రకాష్ హీరో హీరోయిన్లుగా ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం '47 డేస్'. టైటిల్ కార్డ్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై దబ్బర శశి భూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు. సత్య దేవ్ ఈ చిత్రంలో అసిస్టెంట్ కమీషనర్‌గా కనిపించబోతున్నాడు. ట్రైలర్ రిలీజ్ ఈవెంటులో పాల్గొన్న కమెడియన్ ప్రియదర్శి తన ఫన్నీ స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు.

ఆ హీరో ఎవడో, వాడి కోసం రాలేదు, పెద్ద తోపు అని ఫీలవుతున్నాడు

ఆ హీరో ఎవడో, వాడి కోసం రాలేదు, పెద్ద తోపు అని ఫీలవుతున్నాడు

‘‘ఈ కార్యక్రమానికి రావడానికి ఓ కారణం ఉంది. ఈ స్టేజీ ఉన్న సతీష్‌గారు నాకు లైఫ్ ఇచ్చారు. నా ఫేవరెట్ యాక్టర్లు రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ కోసం వచ్చాను. సత్య దేవ్ అనే యాక్టర్ ఎవడో నాకు తెలవదు. వాడికి పెద్ద తోపు అని ఫీలింగ్. ఇండస్ట్రీలో అంతా పెద్ద తోపు, తురం ఖాన్ యాక్టర్ అని అనుకుంటారట. 47 డేస్.. ఇదేం టైటిలో నాకు అర్థం కాలేదు. ప్రదీప్ గారిని ఒక్కటే ప్రశ్న అడుగుదామనుకుంటున్నా. హైదరాబాద్‌లో నా లాంటి మంచి యాక్టర్ ఉండగా అలాంటోన్ని నువ్వు హీరోగా ఎలా తీసుకున్నావో అర్థం కావడం లేదు. ప్రకాష్ రాజ్ రేంజి యాక్టర్ అవుదామని వచ్చిండట ఈ సత్యగాడు. '' అంటూ ప్రియదర్శి తన ఫన్నీ స్పీచ్‌తో అందరినీ నవ్వించాడు.

‘47 డేస్' ట్రైలర్

‘‘నా పేరు సత్య.. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్. నాకు తెలిసి లైఫ్ కంటే మిస్టరీ ఏమీ లేదు. కానీ అంతకంటే పెద్ద మిస్టరీ నా జీవితంలోకి వచ్చింది. నా గతాన్ని వెలికి తీసి నా ప్రస్తుతాన్ని వెంటాడుతోంది.'' అంటూ సత్య చెప్పే డైలాగుతో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది.

థ్రిల్లర్ మూవీ

థ్రిల్లర్ మూవీ

47 రోజుల్లో అసిస్టెంట్ కమీషనర్ సత్య జీవితంలోని మిస్టరీని ఛేదించే క్రమంలో ఆసక్తిగా సినిమాను ముందుకు నడిపించినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఆ మిస్టరీ ఏమిటనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్

ఈ చిత్రంలో హరితేజ, రవి వర్మ, శ్రీకాంత్ ఐయ్యంగార్, ఇర్ఫాన్, బేబీ అక్షర, ముఖ్తార్ ఖాన్, కిరీటి, అశోక్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తుండగా, జికె సినిమాగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X