twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ సంస్కారానికీ సభ్యతకూ బహుథా కృతజ్ఞతలు.. కేటీఆర్‌పై ప్రియదర్శి కామెంట్స్

    |

    తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కళలంటే ఎంతో ప్రీతి. అందుకే సినీ రంగ ప్రముఖులను అప్పుడప్పుడు కలుస్తుంటారు. కవులు, రచయితలు, కళాకారులను నిత్యం ప్రోత్సహిస్తుంటారు. ఇదే క్రమంలో నటుడు ప్రియదర్శి తండ్రి రచించిన గీతాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు తన కార్యాలయంలో ఆవిష్కరించగా.. దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు కేటీఆర్ చేసిన ట్వీట్ సైతం తెగ హల్చల్ చేస్తోంది.

    ఇవాళ తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసే అవకాశం లభించిందని, తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్ప కళను గురించి వర్ణించే ఈ పాట మనసుని హత్తుకుందని చెప్పుకొచ్చారు. సుబ్బాచారి రచించిన తెలుగాంగ్ల మిశ్రసమాస నిఘంటువును కూడా ఆవిష్కరించడం జరిగింది. భారతీయ భాషలలో ఇటువంటి రచనలలో ఇది మొదటిదని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.

     Actor Priyadarshi Thanks To KTR

    తన తండ్రి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర పైన ఎంతో ప్రేమతో రాసిన ఈ పాటను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ కి ప్రియదర్శి ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. 'అన్న, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మా నాన్నగారి పాటను నిఘంటువును ఆవిష్కరించారు. కవులను విద్యావంతులను ఇలా ఇంతగా గౌరవించే మీ సంస్కారానికీ సభ్యతకూ బహుథా కృతజ్ఞతలము'అని పేర్కొన్నాడు. ప్రియదర్శి ప్రస్తుతం లూజర్ వెబ్‌సిరీస్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు. లూజర్ వెబ్ సిరీస్ సెలెబ్రిటీలను సైతం ఆకట్టుకుంది.

     Actor Priyadarshi Thanks To KTR

    English summary
    Actor Priyadarshi Thanks To KTR. Priyadarshi’s father and noted professor Pulikonda Subbachary has penned a song highlighting the culture, history, art and literature of the state of Telangana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X