అడల్ట్ మూవీలో నటించడానికి కారణమిదే.. ఆ సినిమాలో పైకి కిందకి అంటూ.. బండ్ల గణేష్ క్లారిటీ
నటుడిగా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బండ్ల గణేష్ అప్పుడప్పుడు తన కామెంట్స్ తో కూడా అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉంటాడు. ముఖ్యంగా హీరోలను పొగడ్తలతో ముంచెత్తడంలో అతని తరువాతే ఎవరైనా అనే విధంగా ఒక మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. అయితే బండ్ల గణేష్ ఇటీవల చిన్న ఒక ఇంటర్వ్యూలో తన పాత రోజులను గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా అడల్ట్ మూవీస్ లో నటించడానికి గల కారణాన్ని కూడా బండ్ల గణేష్ తెలియజేశాడు. ఆ వివరాలలోకి వెళితే..

మొదట అలా గుర్తింపు
బండ్ల గణేష్ చాలా చిన్నస్థాయి నటుడు నుంచి ఒక మేజర్ కామెడీ పాత్ర చేసే వరకు కూడా వచ్చాడు. ముఖ్యంగా మొదట తనకు ఎస్ వి కృష్ణారెడ్డి అవకాశాలు ఇచ్చారు అని వినోదం సినిమా తర్వాత తనకు కొంత గుర్తింపు లభించింది అని చెప్పాడు. అంతే అయితే ఎస్ వి కృష్ణారెడ్డి సినిమాల్లో నటించినప్పటికీ కూడా తర్వాత కూడా మళ్ళీ ఎప్పటిలానే అవకాశాల కోసం తిరిగిన సందర్భాలు ఉన్నాయి అని గణేష్ చెప్పారు.

తిరగడమే సరిపోయింది
సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ఈరోజు నిర్మాతగా కొనసాగాను అంటే చాలామంది సహాయం కూడా ఉంది. అయితే నటుడిగా మాత్రం ఎప్పుడూ పూర్తిస్థాయిలో పెద్దగా సంతృప్తి చెందలేదు. జీవితాంతం కూడా నటన జీవితంలో అయితే అవకాశాల కోసం తిరగడమే సరిపోయింది. ఏ దర్శకుడు కలిసిన కూడా నటుడిగా ఛాన్స్ కోసం వారిని పొగిడేవారిని అని బండ్ల గణేష్ తెలిపారు.

రియల్ ఎస్టేట్ లో సంపాదన
ఇక నిర్మాతగా మారాలని అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎప్పటికైనా నిన్ను నిర్మాతను చేస్తాను అని ఆయన మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. గబ్బర్ సింగ్ సినిమాతో నిర్మాతగా మరి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాను. అయితే ఆ సినిమా కంటే ముందే నేను ఆర్థికంగా కుదురుకున్నాను. రాజశేఖర్ రెడ్డి హయాంలో రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. అప్పుడు నేను రియల్ ఎస్టేట్ రంగంలో దేవుడు దయ వల్ల బాగానే సంపాదించుకున్నాను.. అని అన్నారు.

రాజకీయ నాయకులతో..
రియల్ ఎస్టేట్ తర్వాత మంచి పౌల్ట్రీ బిజినెస్ కూడా పెట్టుకొని నాకంటూ ఆర్థికంగా ఒక గుర్తింపు అందుకున్నాను. చాలామంది రాజకీయ నాయకులతో కూడా నాకు ఒకప్పుడు చాలా మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఇప్పటికీ కూడా ఎంతో మంది పొలిటిషియన్ తో నేను రెగ్యులర్ గా టచ్ లో ఉంటాను. ఎవరితోనూ నాకు వ్యక్తిగతంగా అయితే వివాదాలు లేవు.. అని గణేష్ తెలిపారు.

అడల్ట్ మూవీస్ లో..
అయితే సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో మధ్యలో ఒకసారి సారీ ఆంటీ అనే అడల్ట్ మూవీ లో బండ్ల గణేష్ నటించడం జరిగింది. అయితే ఆ విషయంపై ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గణేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే నిర్మాత నటి కుమార్ వచ్చి ఒక సినిమాలో హీరో పాత్ర అని చెప్పారు అప్పట్లో అలాంటి లీడ్ పాత్రలు దొరికితే చాలా అదృష్టం అని భావించేవారు. ఇక నేను కూడా అదే ఆశతో ఆ సినిమాలో నటించాను.. అని బండ్ల గణేష్ చెప్పాడు.

పైకి కిందకు అన్నారు..
కానీ సినిమా మొదలుపెట్టిన తర్వాత అసలు విషయం తెలిసింది. అయితే అప్పట్లో నాలాంటి నటీనటులకు ముందే కథ గురించి చెప్పే అవకాశం లేదు. హీరోగా ఛాన్స్ వచ్చింది అంటేనే చాలా అదృష్టంగా భావించే వాళ్ళం. అందుకే ఆ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నాను. కానీ సినిమా షూటింగ్ మొదలైన తర్వాత ఏమీ లేదు పైకి కిందకి అని ఏదో చెప్పారు. ఇక నేను కూడా ఏదో ఉంటుంది అనుకొని సినిమా చేశాను. అందులోకి దిగాక అసలు విషయం అర్థమైంది. ఇక ఆ తర్వాత మళ్లీ అలాంటి సినిమాలు చేయలేదు అని బండ్ల గణేష్ తెలిపారు.


Click it and Unblock the Notifications











