నా బ్లడ్‌లోనే అది ఉంది.. ఇస్కాన్ రాజా స్కాములతో జీవితాలు భ్రష్టు.. బండ్ల గణేష్ ట్వీట్లు వర్షం

టెంపర్ సినిమా వివాదం నిర్మాతలు బండ్ల గణేష్, పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) మధ్య చిచ్చురేపింది. వారిద్దరి మధ్య మాటల యుద్ధం మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. గత రెండు రోజులుగా వరుస ట్వీట్లతో విజృంభిస్తున్న బండ్ల గణేష్ తాజాగా మరోసారి ట్వీట్లతో విరుచుకుపడ్డారు. పీవీపీని పరోక్షంగా ఇస్కాన్ రాజా అంటూ టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్లు ఇవే..

టెంపర్ ఆడియో ఫంక్షన్‌లో

టెంపర్ ఆడియో ఫంక్షన్‌లో

టెంపర్ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో జరిగిన విషయాన్ని ట్వీట్‌ ద్వారా ప్రస్తావించారు. నేను కష్టాల్లో ఉన్నాను. నాకు కొంచెం ఇమేజ్ పెంచు. నా గురించి కొంచెం బాగా మాట్లాడు ప్లీజ్ అని నా కాళ్లు పట్టుకునేంత పనిచేశాడు. దాంతో ఆయనకు అనుకూలంగా మాట్లాడాల్సి వచ్చింది అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

నీ జల్సా అంతా కాదు నా బతుకు

నీ జల్సా అంతా కాదు నా బతుకు

ఇక ఒక్కరోజులు బొంబాయిలో నీవు చేసిన జల్సా అంతా లేదు నా బతుకు. నీవు చేసిన స్కామ్‌లు దేశ విదేశాల్లో కీర్తి పొందాయి. ఎన్నో స్కాములకు నీవు మూలం. దొంగ సంతకాలతో ఎంతో మంది జీవితాలను బ్రష్టుపట్టించావు. ఎంతో మందిని మోసం చేశావు అని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

నా బ్లడ్‌లో ఫుష్కలంగా

నా బ్లడ్‌లో ఫుష్కలంగా

బండ్ల గణేష్ మరో ట్వీటులో కష్టపడే మనస్తత్వం పుట్టుకతోనే రావాలి. అది రక్తంలోనే ఉంటుంది. కష్టపడే మనస్తత్వం నా బ్లడ్‌లో పుష్కలంగా ఉంది. ఎక్కడ స్కామ్‌లు ఉంటే నీవు అక్కడ ఉంటావు. భగవంతుడు నీకు రెండు ఇంగ్లీషు ముక్కలు నేర్పించి చాలా తప్పు చేశాడు అని దుయ్యబట్టాడు.

నేనేంటో సత్తి రంగయ్యను అడుగు

నేనేంటో సత్తి రంగయ్యను అడుగు

ఇక తెలుగు ఇండస్ట్రీలో ఎవరేంటో తెలుసుకుందాం రా అంటూ బండ్ల గణేష్ సవాల్ విసిరినంత పనిచేశాడు. నా గురించి తెలుగు ఇండస్ట్రీలో పెద్ద తలకాయ, 50 ఏళ్ల నుంచి ఫైన్సాన్స్ రంగంలో ఉన్న సత్తి రంగయ్యను అడుగు నేనేంటో చెబుతాడు. నా క్యారెక్టర్ ఏంటో ఆయన చెబుతాడు తెలుసుకో. నువ్వేంటి స్కాం రాజా.. నా క్యారెక్టర్ గురించి నువ్వా చెప్పేది అంటూ పరోక్షంగా పీవీపీని ట్వీట్‌తో టార్గెట్ చేశారు.

ఇకనైనా నీతిగా ఉండు

ఇకనైనా నీతిగా ఉండు

బండ్ల గణేష్ హితబోధ చేస్తూ.. ఇప్పటికైనా పిచ్చి వేషాలు మానుకొని.. నీతిగా, నిజాయితీగా బతుకు. కష్టపడి బతుకు. నా గురించి ఒక్కటి గుర్తుపెట్టుకో.. 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నా.. మరో 30 ఏళ్లు ఇక్కడే ఉంటా. ఈ ఇండస్ట్రీలోనే చచ్చిపోతా. నీలాగా వెయ్యి ఎవ్వరాలు.. వెయ్యి స్కాంలు ఉండవు అంటూ మరో ట్వీట్‌లో ధ్వజమెత్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X