Bandla Ganesh: నాకు వార్నింగ్ ఇచ్చావా.. ఇంటర్వ్యూలో వైసీపీ నేతకు బండ్ల గణేష్ ఫోన్ కాల్!

మొదట నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇక మధ్యలో రాజకీయాల్లో కూడా ఒక అడుగు వేసిన పండ్ల గణేష్ తర్వాత మళ్లీ వెంటనే వెనుకడుగు వేశాడు. ఇక ప్రస్తుతం బిజినెస్ లతోనే కొనసాగుతున్న గణేష్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని కామెంట్లతో కూడా వైరల్ గా మారుతున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడిన విధానం వైరల్ గా మారింది. అయితే అందులో వైసిపి నేతకు సంబంధించిన ఒక ప్రశ్న ఎదురవగా అప్పుడే బండ్ల గణేష్ అతనికి ఫోన్ కాల్ చేయడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

స్టార్స్ తో సినిమాలు

స్టార్స్ తో సినిమాలు

బండ్ల గణేష్ నటుడిగా కంటే కూడా నిర్మాతగా మంచి గుర్తింపును అందుకున్నాడు. మొదట పవన్ కళ్యాణ్ తీన్ మార్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ను స్టార్ట్ చేసిన అతను ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ లతో కూడా సినిమాలను నిర్మించిన బండ్ల గణేష్ ఆ తరువాత పలు వ్యాపారలతోనే ఎక్కువగా బిజీగా మారిపోయాడు.

అన్యాయంగా మాట్లాడితే..

అన్యాయంగా మాట్లాడితే..

నిర్మాతగా చాలా గ్యాప్ ఇచ్చిన బండ్ల గణేష్ ప్రస్తుతం మాత్రం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వివిధ రకాల అంశాలపై స్పందించే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎవరైనా కామెంట్ చేస్తే మాత్రం అప్పుడే వెంటనే రియాక్ట్ అవుతున్నాడు. ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే అన్యాయంగా మాట్లాడితే మాత్రం నేను కూడా కౌంటర్ ఇస్తాను అని చెబుతున్నాడు.

బండ్ల గణేష్ కు వార్నింగ్

బండ్ల గణేష్ కు వార్నింగ్

అయితే ఆ మధ్యకాలంలో బండ్ల గణేష్ ఆంధ్రప్రదేశ్ వైసీపీ నేతలపై కూడా చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ముఖ్యంగా కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపై కూడా బండ్ల గణేష్ కౌంటర్ ఇవ్వడంతో అతనికి వార్నింగ్ వచ్చినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో గణేష్ అతనికి కాల్ చేసి మరీ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

ఇంటర్వ్యూలో ఫోన్ కాల్

ఇంటర్వ్యూలో ఫోన్ కాల్


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీకు మార్నింగ్ ఇచ్చారు అది నిజమే కదా అని ఇటీవల ఇంటర్వ్యూ లో వచ్చిన ప్రశ్నకు గణేష్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. వెంటనే అనిల్ కుమార్ యాదవ్ కు ఫోన్ చేసి అన్నా మీరు నాకు వార్నింగ్ ఇచ్చారా అని అడగ్గానే అందుకు అతను.. నేను మీకు వార్నింగ్ ఎందుకు ఇస్తాను అని సమాధానం ఇచ్చారు. క్లారిటీ వచ్చేసింది కదా అంటూ మరల గణేష్ అక్కడే వివరణ ఇచ్చాడు.

పూరి పై చేసిన కామెంట్స్

పూరి పై చేసిన కామెంట్స్

అలాగే ఆ మధ్య కాలంలో పూరి జగన్నాద్ పై చేసిన కొన్ని వ్యాఖ్యలపై కూడా బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూరిని ఏదైనా అనే హక్కు తనకు ఉంది అని అలాగే నేను ఏదైనా తప్పు చేస్తే పూరీ కూడా తిడతాడు.మ్ మాకు మాకు వంద ఉంటాయి అని బండ్ల గణేష్ సమాధానం చెప్పారు. ఇక గతంలో చేసిన పొరపాట్లు అయితే మళ్ళీ ఇప్పుడు జరగకుండా చూసుకుంటాను అని కూడా బండ్ల గణేష్ వివరణ ఇవ్వడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X