Just In
- 59 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్‌పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్‌కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్‌కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 3 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- Sports
రోహిత్.. ఎందుకింత నిర్లక్ష్యం! అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్! గవాస్కర్ ఫైర్!
- News
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గుండెపోటుతో ప్రముఖ నటుడు, నిర్మాత కన్నుమూత.. విషాదంలో టాలీవుడ్
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో శృంగార భరిత, కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటుడు, నిర్మాత యాదా కృష్ణ ఇకలేరు. బుధవారం ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. యాదా కృష్ణ మరణంతో సినీ వర్గాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో శ్రద్దాంజలి ఘటంచారు. ఇక యాదా కృష్ట గురించి మరిన్ని వివరాలు..

నిర్మాతగా, నటుడిగా
నటన, సినీ రంగంపై అమితమైన ఆసక్తి ఉన్న యాదా కృష్ణ నిర్మాతగా మారి తానే హీరోగా పలు సినిమాల్లో నటించారు. 90వ దశకంలో శృంగారభరితమైన కామెడీ చిత్రాలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఇప్పటి వరకు 20కి పైగా చిత్రాల్లో నటించారు. పలు చిత్రాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని మిగిల్చాయి.

యాదా కృష్ణ చివరి చిత్రం
నటుడు, నిర్మాత యాదా కృష్ణ వయసు 61 సంవత్సరాలు. ఆయన చివరిసారిగా నటించిన చిత్రం సంక్రాంతి అల్లుడు. 2010లో విడుదలైన ఈ చిత్రానికి వీవీవీ సత్యనారాయణ దర్శకుడు. ఈ చిత్రంలో సునాక్షి, రోషిణి, ఏవీఎస్, ఆనంత్, రఘునాథ్ రెడ్డి, చిట్టిబాబు, జీవా, కొండవలస, రంగస్వామి, నాగయ్య నాయుడు, కవిత, సుధా లాంటి సినీ ప్రముఖులు నటించారు.

ఆత్మకు శాంతి చేకూరాలని
యాదా కృష్ణ మృతిపై పలువురు ట్విట్టర్‌లో స్పందించారు. యాదా కృష్ణ గురించి ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ట్విట్ చేస్తూ.. యాదాకృష్ణ 20కిపైగా చిత్రాల్లో నటించారు. బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ శ్రద్దాంజలి ఘటించారు.

యాదా కృష్ణ నటించిన చిత్రాలు
యాదా కృష్ణ నటించిన నిర్మించిన చిత్రాల్లో సంక్రాంతి అల్లుడు, ఇద్దరు పెళ్లాలు, బుల్లెమ్మ బుల్లోడు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. ఆయన మృతితో విషాదానికి గురైన నెటిజన్లు ఆయన తీసిన చిత్రాల గురించి సోషల్ మీడియాలో చర్చించుకొంటున్నారు.