Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అపుడు మీరు ఎంత నీచంగా... : పృధ్విని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
30 ఇయర్స్ డైలాగుతో ఇండస్ట్రీలో పాపులర్ అయిన పృథ్వి రాజ్ క్రమ క్రమంగా తన టాలెంటుతో టాప్ కమెడియన్‌గా ఎదిగారు. అందరిలాగే పృథ్వి కూడా సినిమా రంగం నుంచి రాజకీయాల బాట పట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఎస్వీబిసీ చైర్మన్ పదవికి చేపట్టే అవకాశం దక్కించుకున్నారు.
అయితే పృథ్వి గురించి తాజాగా నటి శ్రీరెడ్డి తన సోషల్ మీడియా పేజీలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయింది. ఒకప్పుడు శ్రీరెడ్డి విషయంలో పృథ్వి చేసిన కామెంట్స్ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ వివాదంలో శ్రీరెడ్డి తీరును ఆయన తప్పుబట్టారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టారు.
అపుడు నేను మాట్లాడినట్లే ఇపుడు మీరు మాట్లాడుతున్నారు
‘‘పృధ్వి గారు.. వైసీపీ మనిషిగా మీరంటే నాకు ఇష్టం. కానీ మీరిప్పుడు మీడియా ముందు చెప్పిన పాయింట్స్, నేను గతంలో మీడియా ముందు చెప్పిన పాయింట్స్ మ్యాచ్ అయ్యాయి. చివరకు మీ వరకు వచ్చేసరికి సేమ్ మీరు కూడా హేమ లాగే రియలైజ్ అయ్యారు.'' అని పృథ్వి చెప్పుకొచ్చారు.
అపుడు నా గురించి ఎంత నీచంగా మాట్లాడారో...
‘‘ఒకసారి నా గురించి ఎంత నీచంగా మాట్లాడారో అవే పాయింట్స్ మళ్లీ మీరు ఇపుడు మీడియా ముందు రిపీట్ చేస్తున్నారు, చెక్ చేసుకోండి.'' అని శ్రీరెడ్డి గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు చేయడం ‘‘మీరు నన్ను కొన్ని విషయాల్లో తప్పుబట్టి అదే తప్పు మీరు ఇపుడు చేస్తున్నారు' అని చెప్పే ప్రయత్నం చేశారు శ్రీరెడ్డి.
కర్మ అనేది రబ్బర్ బ్యాండ్ లాంటిది
‘కర్మ అనేది రబ్బర్ బ్యాండ్ లాంటిది. అది తప్పకుండా తిరిగి మీ వద్దకే వస్తుంది' అంటూ పృధ్వి మీద సెటైర్లు పేల్చింది శ్రీరెడ్డి. మరి ఈ కాంట్రవర్సల్ లేడీ చేసిన కామెంట్లపై పృధ్వి ఎలా రియాక్ట్ అవుతారో? చూడాలి.
ఇండస్ట్రీలో పృధ్విని తొక్కేస్తున్న మాట నిజమేనా?
వైసీసీకి మద్దతుదారుడైన పృధ్విని ఇండస్ట్రీలో తొక్కేయాలని ప్రయత్నిస్తున్నారని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం కూడా పృధ్వి స్పందించారు. అది నిజమే అని ఒప్పుకున్నారు. కమిటైన సినిమాల నుంచి తనను తీసేయడంతో అడ్వాన్సులు వెనక్కి ఇచ్చినట్లు తెలిపారు. అయితే తనకు అంతకంటే పెద్ద అవకాశం, శ్రీవెంకటేశ్వర స్వామికి సేవ చేసే చాన్స్ దక్కడం ఆనందంగా ఉందన్నారు. దీనిపై శ్రీరెడ్డి రియాక్ట్ అవుతూ... 30 ఇయర్స్ పృధ్వి రాజ్ గారిని ఇండస్ట్రీలో తొక్కేస్తే నేనెంత? అంటూ ఓ పోస్ట్ పెట్టారు.