RGVకి రూ.100 కోట్ల ప్యాకేజీ... దరిద్రాన్ని చూడను అంటూ నటుడు సంచలనం

సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఆయన సినిమాలు తీస్తే.. సూపర్ హిట్టుగా నిలిచేవి. ఈ మధ్య కాస్త ట్రాక్ తప్పి... ఎక్కువగా వివాదాస్పద సినిమాలు తెరకెక్కిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పుడు తాజాగా ఏపీ పాలిటిక్స్ దృష్ట్యా వ్యూహం అంటూ వస్తున్నాడు. అయితే ఈ వ్యూహం సినిమాపై నటుడు పృథ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...

రామ్ గోపాల్ వర్మ... చిన్న పోస్టు పెట్టిన సంచలనమే. ఆయన ఒకప్పుడు గొప్ప ఫిల్మ్ మేకర్ అనే పేరును తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్య కాస్త రూటు మార్చాడు. బయోపిక్ ల పేరిట సినిమాలు తీస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నాడు. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి పొలిటికల్ సినిమాలు తీసిన ఆర్జీవీ... ఇప్పుడు వ్యూహం అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి... తన తండ్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయాక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు.. ఎలా సీఎం అయ్యాడు అనే నేపథ్యంలో వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Actor Prudhvi Raj Sensational Comments on Rgv Vyooham Movie Package 100crores

ఇక ఇటీవల వ్యూహం సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రైలర్ లో జగన్ పై చంద్రబాబు కుట్ర అంటూ చూపించారు. అంతే కాదు పవన్ కల్యాణ్ ను.. చంద్రబాబు ఎలా వాడుకుంటున్నాడు.. అనేది కూడా చూపించాడు. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా ఉన్న స్కిల్ డవలప్ మెంట్ విషయాన్నీ కూడా ఈ సినిమాలో చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయితే... రాజకీయ పరంగా జనాల్లో మార్పు వస్తుందని వైసీపీ వాళ్లు కూడా ఖుషి అవుతున్నారు.

ఇక ఆర్జీవీ వ్యూహం సినిమాపై థర్టీ ఇయర్స్ పృథ్వి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పృథ్వి రాజ్... ఆర్జీవీ వ్యూహం సినిమా ట్రైలర్, టీజర్ చూశారా అని అడిగితే... అలాంటి అసహ్యాలు చూడను అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాలపై ప్రేమ, జగన్ మోహన్ రెడ్డి మీద ప్రేమతో ఆయన సినిమా తీయలేదు.. ఆయనకేమైనా నొప్పా ఉరికే సినిమా తీయడానికి... రూ.100 కోట్ల ప్యాకేజ్ అందుకున్నాడు కాబట్టే వ్యూహం సినిమా ఆర్జీవీ తీశాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇక పృథ్వి రాజ్ మాట్లాడుతూ... చిరంజీవి గారు అంటే కోపం, పవన్ కల్యాణ్ గారు అంటే కోపం... సోసైటీ అంటే కోపం.. ఆర్జీవీ మెంటాలిటీ డిఫికల్ మెంటాలిటీ. ఎందుకు సినిమా తీస్తారు.. డబ్బులు ఇచ్చారు కాబట్టి. సినిమాలు చూసి జనాలు ఓట్లు వేస్తారు అనుకోవడం తప్పు.. ఇక వ్యక్తులను టార్గెట్ చేస్తూ సినిమాలు తీయడం వేరు.. అప్పట్లో అంటే.. వేరు.. అప్పుడున్న కాలుక్యూలేషన్స్ వేరు.. ఇప్పుడు వేరు.. సినిమాలు చూసి జనాలు మారిపోరు.. ఓట్లు వేయరు అంటూ చెప్పుకువచ్చారు.

Actor Prudhvi Raj Sensational Comments on Rgv Vyooham Movie Package 100crores

ఇక వ్యూహం సినిమా విషయానికి వస్తే... ఈ సినిమా పొలిటికల్, డ్రామా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళ, మలయాళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తున్నాడు. వైఎస్ భారతీ పాత్రను మానస రామకృష్ణ అనే కొత్త నటి నటిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న వ్యూహం సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X