దుమ్మురేపుతున్న రాధిక కుమారస్వామి.. ఇంటర్నెట్‌లో టాప్ ట్రెండింగ్..
ఏ కారణం లేకుండానే కొందరు వ్యక్తులు వార్తల్లో నిలుస్తుంటారు. తమకు సంబంధం లేకపోయిన వారి గురించి ఏవేవో కథనాలు వస్తుంటాయి. సినిమా ప్రముఖులకు సంబంధించిన వారి సంగతి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అలాంటి ఒక సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నది. సినీ నటి రాధిక కుమారస్వామి ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ మారింది. ఆమె కర్ణాటక రాష్ట్రానికి కాబోయే సీఎం భార్య కావడమే అందుకు కారణంగా మారింది.
Recommended Video


టాప్ ట్రెండింగ్
కర్ణాటకలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఆ రాష్ట్రంలో హంగ్ ఏర్పడటంతో జేడీఎస్ పార్టీ నేత కుమారస్వామి పేరు అనూహ్యంగా సీఎంగా తెరపైకి వచ్చింది. దాంతోపాటు సినీ తార రాధిక పేరు కూడా ట్రెండింగ్‌గా మారింది. చాలా మంది రాధిక కోసం వెతుకుతూ ఆమె గురించి తెలుసుకొంటున్నారు.

14 ఏళ్ల వయసులోనే నటిగా
తన 14 ఏళ్ల వయసులోనే రాధిక కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆమె నటించిన నీలమేఘ శ్యామ చిత్రం ద్వారా హీరో రాఘవేంద్ర సరసన నటించారు. ఆ ఏడాది ఆ చిత్రం అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 2003లో రాధిక నటించిన చిత్రాలకు ప్రేక్షక ఆదరణ దక్కకపోవడంతో నటిగా వెనుకపడింది. ఈ క్రమంలో 2006లో కుమారస్వామితో పెళ్లి జరిగింది. కానీ చాలా గోప్యంగా ఉంచి నవంబర్ 2010లో వారి పెళ్లి విషయాన్ని బయటపెట్టారు. అప్పటికే ఆమెకు షమికా కే స్వామి అనే కూతురు కూడా ఉన్నారు.

తెలుగులో తారకరత్నతో భద్రాద్రి రాముడు
ఆ తర్వాత తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. తెలుగులో తారకరత్నతో భద్రాద్రి రాముడు నటించారు. తమిళంలో నవశక్తి వైభవం చిత్రంలో కనిపించారు. 2013లో స్వయంగా నిర్మాతగా మారి స్వీటి నన్న జోడి అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా హీరోగా నటించారు.

సినిమాలతో బిజీ బిజీగా
ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్‌తో కాంట్రాక్టు, భైరవదేవి, రాజేంద్ర పొన్నప్ప, నిమగాగి ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. త్వరలోనే కాంట్రాక్టు సినిమా రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఇదిలా ఉండగా, రాధిక రాజకీయాల్లోకి వెళ్తున్నారనే రూమర్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications











