Drugs Case సినీ హీరో ప్రేయసి అరెస్ట్.. డ్రగ్స్ కేసులో తెరపైకి మరో వ్యక్తి.. రిమాండ్‌కు తరలింపు
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ పట్టివేతతో తెలుగు సినిమా పరిశ్రమ ఉలిక్కిపడింది. తెలంగాణకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులు జరిపిన మెరుపుదాడుల్లో ఇద్దరు వ్యక్తులు డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. పక్కాగా అందిన ముందస్తు సమాచారంతో రైడ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
తెలంగాణను డ్రగ్స్ రహిత ప్రాంతంగా మార్చాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కొద్ది రోజులుగా డ్రగ్స్ సప్లైదారులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో అందిన సమాచారం మేరకు రెక్కి నిర్వహించారు. ఆ తర్వాత సమాచారం పక్కా అని తెలుసుకొన్న ఎస్ఓటీ అధికారులు నార్సింగిలోని ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ రైడ్‌లో లావణ్య అనే స్కూల్ టీచర్‌ను అరెస్ట్ చేశారు.

లావణ్య అనే మ్యూజిక్ టీచర్‌పై సోదాలు నిర్వహించగా ఆమె హ్యాండ్ బ్యాగ్ నుంచి డ్రగ్స్ లభించాయి. దాంతో ఆమెను విచారించగా... ఉనీత్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ ప్యాకెట్స్ ఇచ్చారని వెల్లడించినట్టు సమాచారం. తాను ఉనీత్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆమె అంగీకరించడంతో ఆమెను అదుపులోకి తీసుకొన్నారు.
ఆ తర్వాత లావణ్య ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్ పెడ్లర్ ఉనీత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతడిని విచారించిన తర్వాత మరింత సమాచారం రాబట్టారు. లావణ్య, ఉనీత్ మొబైల్స్ కాల్స్, వాట్సాప్ డేటాపై దృష్టిపెట్టినట్టు సమాచారం.

లావణ్య, ఉనీత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారిస్తున్నారు. లావణ్య, ఉనీత్‌కు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరిపై NDPS 22B, Red With 8C సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.ఇద్దరిని కూడా రిమాండ్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా, లావణ్య అనే యువతి తెలుగు సినీ హీరో రాజ్ తరుణ్‌కు ప్రేయసి అనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా రాజ్ తరుణ్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? లేదా అనేది విచారణలో తేలనున్నది. అయితే ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్ కూడా స్పందించకపోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











