Raja Chembolu : సిరివెన్నెల తనయుడి వివాహాం.. ఫోటోలు వైరల్

టాలీవుడ్‌లో పెళ్లి సందడి ఇంకా తగ్గడం లేదు. లాక్ డౌన్‌లోనే పెళ్లిళ్లు జరిగాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మన హీరోలు పెళ్లి పీఠలెక్కారు. ఇంకా కొందరు లైన్‌లో ఉన్నారు. ఇంకా కొన్ని చర్చల దశల్లోనే ఉన్నాయి. మొత్తానికి ఈ ఏడాది అంతా పెళ్లిళ్ల సందడే ఉంది. హీరోలు నిఖిల్, నితిన్, రానాలు బ్యాచ్‌లర్ లిస్ట్‌లో బయట పడ్డారు. కరోనాను దృష్టిలో ఉంచుకునే వీలైనంత తక్కువ మందిని ఆహ్వానించి పెళ్లి చేసుకున్నారు. అదే క్రమంలో తాజాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి తనయుడు రాజా చెంబోలు కూడా వివాహం చేసుకున్నాడు.

నిశ్చితార్థం అలా..

నిశ్చితార్థం అలా..

ఆగస్టు 13న రాజా నిశ్చితార్థం సింపుల్ అండ్ స్వీట్ గా జరిగింది. ఐతే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘2020లో అతిగొప్ప విషయం.. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.. మీ అందరి ప్రేమ, అభిమానాలకు థ్యాంక్స్' అంటూ తన శ్రీమతిని అందరికీ పరిచయం చేశాడు.

నిన్న వివాహాం..

నిన్న వివాహాం..


సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కనిష్ట పుత్రుడు నటుడు రాజా వివాహం చి.ల.సౌ. వెంకటలక్ష్మి హిమబిందుతో జరిగింది. అక్టోబర్ 31 ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో 10.55 నిమిషాల సుముహార్తానికి ఈ జంట ఒక్కటైంది.

సన్నిహితుల సమక్షంలో..

సన్నిహితుల సమక్షంలో..

వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్, కృష్ణవంశీ, క్రిష్, గుణ్ణం గంగరాజు, వంశీ పైడపల్లి, ప్రముఖ నిర్మాతలు శ్రీ అల్లు అరవింద్, వెంకట్ అక్కినేని, రచయిత బుర్ర సాయిమాధవ్ తదితరులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తాజాగా ఫోటోలు..

తాజాగా ఫోటోలు..

తాజాగా రాజా.. ‘విత్ మై వైఫ్ లక్ష్మీ హిమబిందు.. మా ఈ ప్రయాణంలో భాగస్వామ్యులైన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.. బిందుకి ఆమె కింగ్ దొరికాడు.. జస్ట్ మ్యారిడ్.. కొత్త జీవితాన్నిప్రారంభిస్తున్నాం' అంటూ పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కెరీర్ ఇలా..

కెరీర్ ఇలా..

ఫిదాలో వరుణ్ తేజ్ సోదరుడిగా, ఏబీసీడీ సినిమాలో అల్లు శిరీష్‌తో తలపడే విలన్‌గా రాజా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. మిస్టర్ మజ్ను, అంతరిక్షం వంటి సినిమాలతో తనకంటూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X