For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేశ్ గురించి చెపితే కృష్ణగారి కళ్లలో నీళ్లు.. ఉదయ్‌కిరణ్ పిచ్చోడు.. పవన్ మేధావి

  By Rajababu
  |

  డబ్బుల కోసం క్రైస్తవ మత ప్రచారకుడిగా మారానని వస్తున్న ఆరోపణలను సినీ నటుడు రాజా ఖండించారు. నా దృష్టిలో మతం అనేది లేదని ఆయన స్పష్టం చేశాడు. డబ్బుల కోసం మత మార్పిడి చేస్తున్నారనే విమర్శలను ఆయన తప్పు పట్టారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి ప్రేమను పంచడం కోసం బోధనలు చేస్తున్నాను. మానవత్వం మించిన మతం ఏదీ లేదని ఆయన అన్నారు. ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ.. తన జీవితంలోని పలు అంశాలను వివరించారు.

  ఉదయ్‌తో మాట్లాడకపోవడం..

  ఉదయ్‌తో మాట్లాడకపోవడం..

  సినీ నటుడు ఉదయ్ కిరణ్ సూసైడ్‌పై ఆయన స్పందించారు. సమస్యలతో బాధపడుతున్న ఉదయ్‌ను కలుసుకోవాలని చాలా సార్లు అనుకొన్నాను. ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత అపోలో హాస్పిటల్‌లో బెడ్ మీద ఉన్న ఆయన శవాన్ని చూసి బాధపడ్డాను. బాధతో ఏడ్చాను. ‘ఉదయ్ కిరణ్ చాలా పిచ్చివాడు' అని మనసులో అనుకొన్నాను. అతడిని కలుసుకొని మాట్లాడకపోవడం నన్ను ఇంకా వేధిస్తుంటుంది అని రాజా చెప్పాడు.

  డిప్రెషన్ గురికాను..

  డిప్రెషన్ గురికాను..

  చాలా మంది సినిమానే ప్రపంచం అనుకొంటారు. అవకాశాలు, సక్సెస్ రాకపోతే ఇక జీవితం అనుకొంటారు. అందుకే వారు తీవ్రమైన చర్యలకు పాల్పడుతారు. ఒకరు తనపై తాను బాధపడితే డిప్రెషన్ మొదలవుతుంది. నేను అలాంటి డిప్రెషన్‌కు దూరంగా ఉంటాను అని చెప్పాడు.

  మహేశ్ తన పనేంటో తాను చేసుకు..

  మహేశ్ తన పనేంటో తాను చేసుకు..

  తన పనేంటో తాను చూసుకోవడం మహేశ్‌బాబు తత్వం. మిగితా విషయాలను పట్టించుకోడు. ఫెయిల్యూర్స్‌ను అధిగమించి కుటుంబ భారాన్ని మీద వేసుకొని విజయం సాధించిన వ్యక్తి మహేశ్‌బాబు. అమెరికాలో ఉన్నప్పుడు మహేశ్ బాబు నటించిన అతడు సినిమా చూశాను. ఆ సందర్భంగా స్క్రీన్ మీద మహేశ్ కనబడితే ఫ్యాన్స్ అరుపులు, కేకలు నన్ను ఎంతో ఆకట్టుకొన్నాయి. నాకు కూడా మహేశ్ అంటే ఇష్టం అని రాజా తెలిపారు. అర్జున్ సినిమాలో మహేశ్‌తో కలిసి రాజా నటించిన సంగతి తెలిసిందే.

  కృష్ణగారి కళ్లలో నీళ్లు..

  కృష్ణగారి కళ్లలో నీళ్లు..

  సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీతో ఓక మరిచిపోలేనటువంటి మెమొరీ ఉంది. అతడు సినిమా చూసిన తర్వాత ఓ రోజు సూపర్ స్టార్ కృష్ట నివాసంలో అతడితోపాటు విజయనిర్మలతో కలిసి భోజనం చేశాను. ఆ సమయంలో అమెరికాలో మహేశ్ గురించి ఫ్యాన్స్ చేసిన అల్లరి చెప్పినప్పుడు కృష్ణ ఉద్వేగానికి గురయ్యాడు. మహేశ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను చెప్తుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి అని రాజా చెప్పుకొచ్చారు.

  పవన్ మేధావి..

  పవన్ మేధావి..

  బంగారం సినిమా సమయంలో పవన్ కల్యాణ్‌తో ఉన్న అనుబంధం గురించి రాజా వివరించాడు. పవన్ కల్యాణ్ అమాయకుడు. చాలా మేధావి. ఎవరైనా తనకు నచ్చితే వారిని గుండెల్లో పెట్టుకొంటాడు. నచ్చకపోతే దూరం పెడుతాడు అని రాజా చెప్పాడు. గత ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం కొంత బాధించిందని రాజా చెప్పారు.

  శేఖర్ కమ్ముల డిఫరెంట్

  శేఖర్ కమ్ముల డిఫరెంట్

  ఆనంద్ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలో తనకు అవకాశం ఇచ్చిన శేఖర్ కమ్ములపై రాజా ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనలాగా ఆలోచించేవాళ్లు పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉంటారు. ఫిలిం మేకింగ్‌లో ఆయన డిఫరెంట్ అని చెప్పారు. గోదావరి సినిమాలో తనకు అవకాశం ఇచ్చాడు కానీ అమెరికాలో వేరే షూటింగ్‌లో ఉండటం వలన ఆ సినిమాను చేయలేకపోయాను అని చెప్పారు.

  నరేశ్, మనోజ్ అంటే ఇష్టం..

  నరేశ్, మనోజ్ అంటే ఇష్టం..

  క్రిస్టియన్ మిషనరీస్‌తో కలిసి ప్రస్తుతం పనిచేస్తున్నానని, తనకు సినీ పరిశ్రమకు సంబంధాలు తెగిపోయాయి అని రాజా చెప్పారు. ఇండస్ట్రీలో తనకు అల్లరి నరేష్, రాజేశ్ అత్యంత సన్నిహితులు. మంచు మనోజ్ అంటే చాలా ఇష్టం అని రాజా వెల్లడించారు.

  English summary
  Actor Raja is now away from the Film Industry. He now associated with christian missionaries. Recently he spoke to Youtube channel regarding his life and future plans. Raja shares his experience with Maheshbabu, Pawan Kalyan, Shekhar Kammula.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X