twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంపుతానని బెదిరించలేదు.. అక్కడే తేల్చుకొంటా.. రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్టు..

    |

    రాజ్ తరుణ్ కారు ప్రమాదం సంఘటన తర్వాత వీడియోలు చిత్రీకరించిన వ్యక్తిపై నటుడు రాజా రవీంద్ర ఘాటుగా స్పందించారు. తాను ఆయనపై బెదిరింపులకు పాల్పడలేదని, చంపుతానని కూడా బెదిరించలేదని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, కార్తీక్ అనే వ్యక్తి గత చరిత్ర ఏంటో తెలిస్తే.. ఆయన స్వరూపం బయటపడుతుందని రాజా రవీంద్ర మీడియాకు ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజ్ తరుణ్ కారు ప్రమాద ఘటన గురించి వెల్లడిస్తూ..

    రాజ్ తరుణ్ పారిపోతుంటే

    రాజ్ తరుణ్ పారిపోతుంటే

    రాజ్ తరుణ్ ప్రమాద ఘటనలో ఏం జరిగిందో తెలియదు. ఆ తర్వాత ఓ వ్యక్తి ఫోన్ చేసి రాజ్ తరుణ్ పారిపోతుంటే వీడియో తీశానని చెప్పాడు. ఒకవేళ వీడియోను డిలీట్ చేయాలంటే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో ఈ విషయాన్ని రాజ్ తరుణ్ అసిస్టెంట్‌కు చెప్పి పరిష్కరించుకోవాలని సూచించాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి పలుమార్లు ఫోన్ చేసి కనీసం రూ.3 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశాడు అని రాజా రవీంద్ర చెప్పారు.

    బ్లాక్ మెయిల్ చేసేందుకు

    బ్లాక్ మెయిల్ చేసేందుకు

    రాజ్ తరుణ్ వ్యవహారంలో బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించిన కార్తీక్ సినిమా పరిశ్రమకే సంబంధించిన వారే. ఆయన క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకొని చీట్ చేశాడు. ఆయనపై గృహ హింస చట్టం కింద కేసు కూడా ఉంది. ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేకనే.. ఇలాంటి చీప్ పనులకు పాల్పడ్డాడరని ఆరోపించారు.

    పరువు నష్టం దావా వేస్తా

    పరువు నష్టం దావా వేస్తా

    తనపై, రాజ్ తరుణ్‌ పరువుకు భంగం కలిగే విధంగా ఆరోపణలు చేసిన కార్తీక్‌పై చట్టపరంగా చర్యలు తీసుకొంటానని రాజా రవీంద్ర ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆయనపై పరువు నష్టం దావా కూడా వేస్తానని, న్యాయపరంగా ఈ విషయాన్ని తేల్చుకొంటానని చెప్పారు. ఆయనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని, కోర్టులోనే తేల్చుకొంటానని మరో ప్రశ్నకు రాజా రవీంద్ర పేర్కొన్నారు.

    ఎందుకు పారిపోయాడంటే

    ఎందుకు పారిపోయాడంటే

    కారు ప్రమాద ఘటన తర్వాత రాజ్ తరుణ్ ఎందుకు అలా పారిపోయాడో అనే విషయం తెలియదు. అతడు తనకు కలిస్తేనే అసలు విషయం తెలుస్తుంది. అప్పటి వరకు తానేమీ చెప్పలేను. బహుశా కారు ప్రమాదం తర్వాత భయపడి పారిపోయి ఉంటాడని అనుకొంటాను. అంతకు మించి ఏమీ లేదు అని రాజా రవీంద్ర అన్నారు. రాజ్ తరుణ్‌కు రాజా రవీంద్ర మేనేజర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

    రాజ్ తరుణ్ అరెస్ట్.. విడుదల

    రాజ్ తరుణ్ అరెస్ట్.. విడుదల

    కాగా, కారు ప్రమాద ఘటనలో రాజ్ తరుణ్‌ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ కింద కొన్ని సెక్షన్లతో కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ దరఖాస్తు మేరకు స్టేషన్ బెయిల్ ఇచ్చి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కార్తీక్ వ్యవహారం మీడియాలో సంచలనంగా మారింది.

    English summary
    Tollywood hero Raj Tarun arrested in Car accident which happend on 20th of August. In this connection, Raj Tarun arrested by Madhapur Police. Police were confired his arrest to media. In this occassion, Raj Tarun manager Raj Ravindra reacted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X