twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’లో ఐక్యత లేదు, విబేధాల గురించి మాట్లాడను, సత్తా చూపిస్తాం: రాజశేఖర్

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో విబేధాలు మళ్లీ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా.. 'మా' ప్రధాన కార్యదర్శి సీనియర్ నరేష్ వర్గాలు నిధుల దుర్వినియోగం విషయంలో గొడవ పడ్డాయి. తర్వాత పెద్దల జోక్యంతో ఈ వివాదం సమసిపోయింది.

    మార్చి 10న జరిగే 'మా' ఎన్నికల్లో రెండు వర్గాలు పోటీ పడుతున్నాయి. మళ్లీ అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు శివాజీ రాజా.... అతడిని దించేసి ప్రెసిడెంట్ అయ్యేందుకు నరేష్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. నరేష్‌ ప్యానల్‌లో జీవిత, రాజశేఖర్, అలీ, శివ బాలాజీ లాంటి వారు చేయడంతో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. నరేష్ ప్యానల్ తరుపున ఉపాధ్యక్షుడిగా నామినేషన్ వేసిన అనంతరం హీరో రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    నాకు భయం.. వద్దు అని ముందు చెప్పాను

    నాకు భయం.. వద్దు అని ముందు చెప్పాను

    ‘మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో నా ఎంట్రీ అనేది అనుకోకుండా జరిగింది. సాధారణంగా నాకు ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం ఉండదు. ఓడిపోతే ఏమిటి? అనే భయం ఉంటుంది. నరేష్ వచ్చి పోటీ చేయాలని కోరగానే నేను వద్దనే చెప్పినట్లు రాజశేఖర్ తెలిపారు.

    అందుకే పోటీ చేస్తున్నాను

    అందుకే పోటీ చేస్తున్నాను

    గొప్పలు చెప్పుకోవడం కాదుకానీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు, ఎన్టీ రామారావుగారు కూడా నన్ను గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని కోరారు. అప్పుడు సినిమాల మీద తప్ప రాజకీయాలపై ఆసక్తిలేదు కాబట్టి పోటీ చేయలేదు. తర్వాత ఓ సందర్భంలో ఆ అవకాశం వాడుకోలేదనే బాధ కలిగింది. మళ్లీ అలాంటి సందర్భం రాకూడదనే ‘మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజశేఖర్ తెలిపారు.

    మన వద్ద అలా ఎందుకు చేయడం లేదనే బాధ ఉంది?

    మన వద్ద అలా ఎందుకు చేయడం లేదనే బాధ ఉంది?

    తమిళనాడు, కేరళ ఇండస్ట్రీల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు ఉన్నట్లుగా ఐక్యత, కోఆపరేషన్ మన వద్ద ఎందుకు లేదు? అనిపిస్తూ ఉంటుంది. తమిళనాడులో విశాల్, నాజర్ గారు చాలా బాగా అసోసియేషన్ రన్ చేస్తున్నారు. వారి మాదిరిగా మనం తెలుగులో ఎందుకు చేయడం లేదనే బాధ మనసులో ఉందని... రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

    విబేధాల గురించి ఇప్పుడు మాట్లాడను

    విబేధాల గురించి ఇప్పుడు మాట్లాడను

    నరేష్ గారు చెప్పినట్లు ఇంతకు ముందు కొన్ని విబేధాలు ఉన్నాయి. ఎలక్షన్లో పోటీ అన్నపుడు విబేధాలు తప్పకుండా ఉంటాయి. అప్పుడే ఏం జరిగిందో నాకు తెలియదు, వాటి గురించి మాట్లాడను. నరేష్ చాలా సిన్సియర్ పర్సన్. ఆయన ఏం చేసినా పర్ఫెక్టుగా చేస్తారు. ఇతర సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు ఎంత పర్పెక్టుగా పని చేస్తున్నాయో... తెలుగులో కూడా అలా పని చేసేలా మా ప్యానల్ పాటుపడుతుంది. వీలైతే అంతకు మించి చేస్తామని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.

    English summary
    Actor Rajasekhar about MAA Association Elections. On March 10, the Movie Artistes Association (MAA) will vote for its new governing body, and everyone is gearing up for it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X