పండుగ పూట టాలీవుడ్ హీరో ఇంట తీవ్ర విషాదం.. దీపావళి సంబరాల్లో మునిగిన సమయంలో!

టాలీవుడ్ లో పండగపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ ప్రముఖులు సహా తెలుగు రాష్ట్రానికి చెందిన దాదాపు అందరూ దీపావళి సంబరాల్లో మునిగి పోయిన సమయంలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే

కొంత వెనుకబడి

కొంత వెనుకబడి

సీనియర్ నటుడు రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తమిళ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన ఆయన తెలుగులో కూడా హీరోగా సెటిల్ అయ్యారు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా ఎన్నో సినిమాల్లో రాజశేఖర్ నటించారు.. పోలీస్ పాత్రలకు పెట్టింది పేరైన ఆయన అంకుశం సినిమాతో తిరుగులేని స్టార్డమ్ తెచ్చుకున్నాడు. సహా నటి జీవితను ప్రేమించి వివాహం చేసుకున్న ఆయన ప్రస్తుతానికైతే సినిమాల విషయంలో కొంత వెనుకబడ్డారు.

92వ సినిమా

92వ సినిమా

చివరిగా 2017లో పిఎస్వి గరుడ వేగ సినిమాతో హిట్ అందుకున్న ఆయన 2019 లో కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు.. అయితే 2020 లో అర్జున అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ అది ఎప్పటిదో అవుట్ డేటెడ్ సినిమా కావడంతో ప్రేక్షకులు దానిని ఆదరించలేదు. ప్రస్తుతం ఆయన కిరణ్ అనే దర్శకుడు దర్శకత్వంలో 92వ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయనకు పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తీవ్ర విషాదం

తీవ్ర విషాదం


అయితే పండుగ పూట రాజశేఖర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.. రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. గురువారం సాయంత్రం దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు జరుగుతున్న సమయంలో రాజగోపాల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వరదరాజన్ గోపాల్ ను సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వరదరాజన్ గోపాల్ వయస్సు 93 సంవత్సరాలు.

పోలీస్ డిపార్ట్మెంట్ లో

పోలీస్ డిపార్ట్మెంట్ లో

తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారిగా వరదరాజన్ గోపాల్ రిటైర్ అయ్యారు. ఆయనకు ఐదుగురు సంతానం కాగా అందులో ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. వరదరాజన్ రెండో సంతానం హీరో రాజశేఖర్ కాగా మిగతా కుటుంబ సభ్యులందరూ చెన్నైలోనే సెటిల్ అయిన కారణంగా ఆయన భౌతిక కాయాన్ని ఈ ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ఒక స్పెషల్ ఫ్లైట్ లో చెన్నైకి తరలించారు. కుటుంబ సభ్యులు చేరుకున్న తర్వాత ఆయనకు చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Recommended Video

Nayeem Diaries : ఆ యాక్టర్ సెట్లో ఉంటే చిర్రెత్తుకొచ్చేది - Damu Balaji
కుమార్తెలు హీరోయిన్లుగా

కుమార్తెలు హీరోయిన్లుగా

ఇక హీరో రాజశేఖర్ కుమార్తెలు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చిన్న కుమార్తె శివాత్మిక ఇప్పటికే దొరసాని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా అందులో నటనతో మంచి పేరు తెచ్చుకుంది. పెద్ద కుమార్తె శివాని కూడా కొన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నించింది కానీ ఆమెకు ఇప్పటిదాకా లైన్ క్లియర్ అవ్వలేదు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న కొన్ని సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. త్వరలో శివాని కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X