Meena అంత విషాదంలో కూడా వెనుకడు వేయలేదు.. ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు గురించి రాజేంద్రప్రసాద్

రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల లాంటి అద్బుతమైన చిత్రాలు అందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్గానిక్‌ మామ,హైబ్రిడ్‌ అల్లుడు. నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్‌, మీనా ప్రధాన పాత్రల్లో కే అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్‌, ప్రఖ్యాత బ్యానర్‌ కల్పన చిత్ర పతాకంపై శ్రీమతి కోనేరు కల్పన నిర్మిస్తున్న ఈ చిత్రంలో బిగ్‌బాస్‌ ఫేం సోహెల్‌, మృణాళిని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చిలో విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంబంధించి పలు విశేషాలను యూనిట్‌ మీడియాతో తెలియజేస్తూ..

30 ఏళ్ల తర్వాత మీనాతో

30 ఏళ్ల తర్వాత మీనాతో

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ... ఎస్‌వీ కృష్టారెడ్డి , నేను, అచ్చిరెడ్డి మళ్లీ ఇంతకాలం తర్వాత కల్పన గారి నిర్మాణంలో కల్పనచిత్ర పతాకంపై 'ఆర్గానిక్‌ మామాహైబ్రీడ్‌ అల్లుడు'తో మరో విజయ విహారానికి సిద్ధం అవుతున్నాం. ఒకప్పుడు ఇంటిల్లిపాదీ చూసే సంస్కారవంతమైన సినిమాలు చేశాం. .. ఈ సినిమాను కూడా అంతే సంస్కారవంతంమైన సినిమా. వంద శాతం ఫ్యామిటీ ఎంటర్‌టైనర్‌. నిర్మాత కల్పన గారు నాకు చిన్నతనం నుంచీ తెలుసు. వాళ్ల నాన్నగారు నిర్మాత కూడా. మీనా కెరీర్‌ ప్రారంభంలో నాతో చేసింది. మళ్లీ ఇంతకాలానికి మా కాంబినేషన్‌ కుదిరింది. ఆమెకు అనుకోని కష్టం వచ్చినా నిర్మాత శ్రేయస్సు కోసం వీలైనంత త్వరగా షూటింగ్‌కు హాజరైంది. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లతో పనిచేయడం వల్ల ఆమెకు ఆ మంచి గుణం అబ్బింది. ఆమెకు ఈ సందర్భంగా బ్లెస్సింగ్స్‌ చెపుతున్నా. హీరో సొహైల్‌ తన పాత్రకు చెందిన అన్ని రసాలను అద్భుతంగా పండిచాడు. సినీ పరిశ్రమలో యాక్టర్‌ కావటానికి నటన తెలిస్తే చాలు.. కానీ సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌ కావాలంటే తప్పకుండా క్యారెక్టర్‌ కావాలి. అది ఉంటే ఇక తిరుగుండదు అని ఈతరం ఆరిస్ట్‌లకు చెపుతున్నా. మిగిలిన ఆర్టిస్ట్‌లు కూడా వారి పరిధిలో అద్భుతంగా చేశారు. అందరూ థియేటర్స్‌లో చూసి ఎంజాయ్‌ చేయండి అన్నారు.

అద్బుతాలను సృష్టించే ప్రోత్సాహంతో

అద్బుతాలను సృష్టించే ప్రోత్సాహంతో


వినోదం తర్వాత నేను చేసిన కంప్లీట్‌ కామెడీ మూవీ 'ఆర్గానిక్‌ మామహైబ్రీడ్‌ అల్లుడు'. నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. రాజేంద్రప్రసాద్‌ గారి గురించి తెలుగు ప్రేక్షకుకు నేను చెప్పేదేముంది. ఆయన నిలబెట్టిన దర్శకుణ్ణి నేను. ఇక మా అచ్చిరెడ్డి గురించి నేను పెద్దగా చెప్పక్కర్లా. ఈ సినిమాకు సంబంధించి నా చేత అద్భుతాలను సృష్టించే ప్రోత్సాహం ఇచ్చారు. అలాగే నిర్మాత కల్పన గారి సహకారం ఎంత చెప్పినా తక్కువే. ఆమెకు కథ విపరీతంగా నచ్చడంతో బాగా ఇన్‌వాల్వ్‌ అయ్యారు. ఇక కెమెరామెన్‌ రాంప్రసాద్‌ గారు సినిమాను కలర్‌ఫుల్‌గా మలిచారు. అని దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.

ప్రాక్టికల్‌గా నటించి చూపించారు..

ప్రాక్టికల్‌గా నటించి చూపించారు..

ఆర్గానిక్ మామ, హైబ్రీడ్ అల్లుడు కథ చెపుతున్నప్పుడే డైరెక్టర్‌ గారు నాకు ఆ క్యారెక్టర్‌ ఎలా మాట్లాడుతుంది.. ఎలా బిహేవ్‌ చేస్తుంది అని ప్రాక్టికల్‌గా కూడా చూపించారు. అంతగా మాకన్నా కృష్ణారెడ్డిగారే ఈ క్యారెక్టర్స్‌లో ఇన్‌వాల్వ్‌ అయిపోయారు. నాకు ఇది కొత్త క్యారెక్టర్‌గానే చెప్పాలి. రాజేంద్రప్రసాద్‌ గారితో 30 సంవత్సరాల తర్వాత చేస్తున్నాను. కృష్ణారెడ్డిగారితో వర్క్‌ చేయాలని చాలాసార్లు అనుకున్నా డేట్స్‌ ప్రాబ్లమ్‌తో కుదరలేదు. నేను తొలిసారిగా ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో పనిచేస్తున్నాను. ఆమెతో చాలా మంచి అనుబంధం ఏర్పడిరది. ఇద్దరం షాపింగ్‌క కూడా వెళ్లేవాళ్ళం. ఇలాంటి మంచి సినిమాతో మళ్లీ మీ ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది అని మీనా అన్నారు.

నా అదృష్టంగా భావిస్తాను అంటూ సోహైల్

నా అదృష్టంగా భావిస్తాను అంటూ సోహైల్

ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలో నటించడం నా అదృష్టంగా భావిస్తాను. కృష్ణారెడ్డి గారి సినిమాలు, రాజేంద్రప్రసాద్‌ గారి సినిమాలు చూసి పెరిగినోళ్లం. ఇంతమంది లెజెండరీ నటీనటులు, టెక్నీషియన్స్‌తో కలిసి పనిచేయడానికి ముందు భయపడ్డా. నువ్వు సీనియర్స్‌తో చేస్తున్నావా? జూనియర్స్‌తో చేస్తున్నావా అనేది వదిలేసి.. కెమెరాను, ప్రేక్షకుల్నే దృష్టిలో పెట్టుకో అని కృష్టారెడ్డిగారు చెప్పారు. ఈ సినిమాలో పెర్‌ఫార్మెన్స్‌, డైలాగ్‌ డెలివరీ అంతా కృష్ణారెడ్డిగారి క్రెడిట్టే. అచ్చిరెడ్డిగారి ప్లానింగ్‌ వల్లే ఇంత పెద్ద ప్యాడిరగ్‌ ఆర్టిస్ట్‌లు ఉన్నప్పటికీ సినిమాను 39రోజుల్లో కంప్లీట్‌ చేశారు. నిర్మాత కల్పన మేడమ్‌ కూడా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. నాకు ఈ అవకాశం రావటానికి కారణమైన సంతోషం సురేష్‌ గారికి థ్యాంక్స్‌. కృష్ణారెడ్డి గారి వింటేజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను మళ్లీ ఇందులో చూస్తారు అన్నారు.

మంచి మెసేజ్ ఉన్న స్క్రిప్టు

మంచి మెసేజ్ ఉన్న స్క్రిప్టు

ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమా బాగా వచ్చింది. మార్చిలో విడుదల చేయటానికి నిర్మాత కల్పన గారు ఏర్పాట్లు చేస్తున్నారు. అందరూ చెప్పినట్లు ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కృష్ణారెడ్డిగారి గత చిత్రాల్లోని మ్యాజిక్‌తో పాటు మంచి మెసేజ్‌ ఉన్న స్క్రిప్ట్‌ ఇది. కల్పన గారు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్లే సినిమా ఇంత తొందరగా హ్యాపీగా పూర్తయింది. రాజేంద్రప్రసాద్‌ గారు, మీనా గారి గురించి కొత్తగా చెప్పాల్సిపని లేదు. సొహైల్‌ ఈ క్యారెక్టర్‌కు హండ్రడ్‌పర్సంట్‌ సూటబుల్‌. అతను 100 శాతం అవుట్‌పుట్‌ ఇచ్చాడు. హీరోయిన్‌ మృణాళిని రవి చక్కగా చేసింది అని అచ్చిరెడ్డి అన్నారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు, సాంకేతిక నిపుణులు


నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, మీనా, సోహెల్, మృణాళిని రవి, సునీల్‌, కృష్ణభగవాన్‌, సన, ప్రవీణ్‌, సప్తగిరి, అజయ్‌ఘోష్‌, రాజా రవీంద్ర, సురేఖ వాణి, పృథ్వి, చలాకీ చంటి, సూర్య, రాజారవీంద్ర తదితరులు
కెమెరా: సీ రాంప్రసాద్‌
ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి
ఆర్ట్‌: శివ
పాటలు: చంద్రబోస్‌, రామజోగయ్య, శ్రీమణి
సమర్పణ: కే అచ్చిరెడ్డి
నిర్మాత: కోనేరు కల్పన
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X