హీరో రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం.. కూతురు మృతికి కారణం ఏంటో తెలుసా?

Rajendra Prasad: ఇటీవల కాలంలో సినీ ఇండ్రస్టీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీలో ఫేమ్, ఫేత్ ఉన్న సెలబ్రెటీల కుటుంబాల్లో ఆకస్మిక మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ హీరో, కమెడియన్, విలక్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి ప్రాణాలు కోల్పోయారు. అసలేం జరిగిందంటే..?

ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ చికిత్స పొందుతూ నేడు(శనివారం) మరణించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.గాయత్రి ఆకస్మిక మృతితో రాజేంద్రప్రసాద్‌ కుటుంబం షాక్ గురైంది. గాయత్రి భౌతికకాయానికి హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఇంటికి తరలించారు కుటుంబసభ్యులు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు.

Actor Rajendra prasad daughter gayathi passes away Pawan Kalyan jr ntr express deep sympathy

ఈ క్రమంలో లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. రాజేంద్ర ప్రసాద్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకొనే మనో ధైర్యాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.' అని సానుభూతి ప్రకటించారు.

అలాగే.. జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజేంద్ర ప్రసాద్ కు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. 'నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి , కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'అని ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X