ఆ ఆదర్శం ఏమైంది గురూ! రాజేంద్రప్రసాద్ కు జరిమానా
అది ఖైరతాబాద్ చౌరస్తా. నటుడు రాజేంద్రప్రసాద్ స్వయంగా కారునడుపుతూ అక్కడికి చేరుకున్నారు. రెడ్ లైట్ పడినా ఆయన కేర్ చేయకుండా కారును ముందుకు ఉరికించారు. అంతే ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రామలింగరాజు కంట్లో పడి దొరికిపోయాడు. తప్పేపోయింది క్షమించండి అని వేడుకున్నాడు రాజేంద్రప్రసాద్.
ఆ నలుగురు సినిమా ఆదర్శాలేమైపోయాయని ప్రశ్నించి ఆ సిఐ మూడు వేల రూపాయల జరిమానా విధించేసరికి రాజేంద్రప్రసాద్ సినిమా ఫక్కీలో కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయట. రాజేంద్రప్రసాద్ సిగ్నల్ ను లెక్కచేయకపోడమొక్కటే కాదు ఆయన కారుకు నెంబరు ప్లేటు ఉన్నా లేనట్టు ఉందట. ఈ రెండు తప్పులకు కలిపి ఆ మూడు వేలు కట్టుకోవలసి వచ్చింది. సినిమాల్లో ఆదర్శాలు వల్లించే వారి నిజ జీవితంలో కూడా ఆచరించి చూపిస్తే సమాజం ముందుకు వెళ్తుంది.


Click it and Unblock the Notifications











