ఎర్ర చందనం దొంగ హీరోనా.. బన్నీపై నోరు జారిన రాజేంద్రప్రసాద్..
Pushpa 2: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసిన 'పుష్ప 2'సినిమా గురించే చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మొతమోగిస్తోంది. కేవలం మూడు రోజులలో 600 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. థియేటర్లలో అల్లు అర్జున్ యాక్షన్ కు ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ లాంటి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి సినీ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ, సీనియర్ రాజేంద్రప్రసాద్ వివాదాస్పదాల వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప 2. ఈ భారీ బడ్జెట్ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై విధ్వంసం సృష్టిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందాన మధ్య కెమిస్ట్రీ అద్భుతం. అలాగే.. ఈ సినిమాపై అల్లు అర్జున్ కష్టపడిన తీరు అందర్ని మెప్పింది. పుష్ప 1 సినిమాకు అల్లు అర్జున్ కు ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాకు గానూ జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నారు. అలాగే.. పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్స్ చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే.. ముఖ్యంగా జాతర సీన్స్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. దీంతో అల్లు అర్జున్ నటన పై సినీ ప్రముఖులు, సినిమా అభిమానులు బన్నీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కానీ, సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రెస్ మీట్ ఏదైనా పాజిటివ్‌గా ఉంటాడు. అందరి గురించి పాజిటివ్‌గా మాట్లాడతాడు. అంతేకాదు బాగా ప్రశంసిస్తుంటాడు, కానీ ఆయన ఉన్నట్టుండి నోరు జారాడు. పుష్ప 2 సినిమాపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్‌గా ఎర్రచందనం స్మగ్లర్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజేంద్ర ప్రసాద్.. కామన్ గా వివాదాలకు దూరంగా ఉంటూ ఎప్పుడైనా ప్రతి వ్యక్తి గురించి పాజిటివ్ గానే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి రాజేంద్రప్రసాద్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పుష్ప 2 సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో అల్లు అర్జున్ నటించిన పుష్ప రాజ్ క్యారెక్టర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందన స్మగ్లర్ గా నటించడం వ్యక్తిని హీరోగా చూపించడం ఏంటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమైందంటే తాజాగా రాజేంద్రప్రసాద్ హరికథ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాకు మ్యాగీ దర్శకత్వం వహించగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్ తో పాటు శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. వాడెవడో ఎర్రచందనం దొంగ వాడు హీరో అంటూ నోరు జారాడు. అంతేకాదు.. తనపై తాను కూడా విమర్శలు చేసుకున్నారు. హీరోలలో మీనింగ్ మారిపోయిందని.. లేడీస్ టైలర్ వాడు హీరోనా.. వాడు పెద్ద సన్యాసి అప్పుల అప్పారావు హీరోనా పేకాట పాప రావు హీరో ఏప్రిల్ ఒకటి తారీకు వాడు పెద్ద దొంగ వాడి హీరోనా.. కానీ మన సమాజంలో మన చుట్టూ మన పక్కనే ఉన్న పాత్రలను తీసుకొని, హీరోగా నటించిన పొందాను అని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఈ సిరీస్ గురించి చెప్పినప్పుడు తనమీద తనకు ఆశ్చర్యం వేసిందని, తాను చేయాలనుకున్నప్పుడు సవాలు తీసుకున్నారని, ఇప్పటివరకు నేను నమ్మిన కథలను జనం ఆదరించారు. ఆ నమ్మకం నాకుంది అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అదే నమ్మకంతో ఈ సిరీస్ లో నటిస్తున్న ఈ సిరీస్ మిమ్ములను బాగా ఆకట్టుకుంటుంది. దీన్ని చూసి థియేటర్లలో ఎందుకు విడుదల చేయలేదని, ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. అలా అనుకోకపోతే నా పేరు మార్చుకుంటా అంటూ సవాల్ విసిరారు రాజేంద్రప్రసాద్.
ఇదిలా ఉంటే రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో దుమారం రేపుతున్నాయి. రాజేంద్రప్రసాద్ బన్నీని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారంటూ సరికొత్త వివాదానికి తెర లేపారు. గతంలో ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా.. ఎర్రచందనం దొంగలు కూడా హీరోలా అంటూ పరీక్షంగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











