twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరిస్థితి అదుపు తప్పుతోంది, శాంతించండి: రజనీకాంత్ పిలుపు

    జల్లి కట్టు ఉద్యమంపై అందరూ శాంతించాలని, ఉద్యమకారులు తమ ఆందోళన విరమించాలని కోరారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తమిళనాడులో 'జల్లికట్టు' ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. నిన్నమొన్నటి వరకు శాంతియుత నిరసనలు, ఆందోళనలకే పరిమితం అయిన ఈ ఉద్యమం ప్రస్తుతం హింసాత్మకంగా మారుతోంది. ఆందోళన కారులు పలు చోట్ల విధ్వంస కాండకు పాల్పడుతున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, నిప్పుపెట్టడం లాంటివి చేస్తున్నారు.

    పరిస్థితి ఇలా మారడానికి కారణం....మెరీనా బీచ్‌ నుంచి ఉద్యమకారులను వెళ్లగొట్టేందుకు పోలీసు చర్య చేపట్టడమే అనే ప్రచారం జరుగుతోంది. ఆ ఆగ్రహంతోనే కొందరు చెన్నై సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింసాకాండకు పాల్పడుతున్నారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ నటుడు రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జల్లి కట్టు ఉద్యమంపై అందరూ శాంతించాలని, ఉద్యమకారులు తమ ఆందోళన విరమించాలని కోరారు. పరిస్థితి హింసాత్మకంగా ఇలానే కొనసాగితే అసాంఘిక శక్తులు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఉద్యమానికి, రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువచ్చే ప్రమాదం ఉందని రజనీ ట్వీట్ చేసారు.

     Rajinikanth’

    రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. జల్లి కట్టు ఉద్యమంపై అందరూ శాంతించాలని, ఉద్యమకారులు తమ ఆందోళన విరమించాలని కోరారు. పరిస్థితి హింసాత్మకంగా ఇలానే కొనసాగితే అసాంఘిక శక్తులు ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఉద్యమానికి, రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువచ్చే ప్రమాదం ఉందని రజనీ ట్వీట్ చేసారు.

    English summary
    South actor Rajinikanth on Monday came out with his appeal on Twitter where he wrote a page in Tamil insisting the protesters to end their protest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X