Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సీనియర్ నటుడు రాళ్లపల్లి కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ.. 850పైగా చిత్రాల్లో..
Recommended Video
తెలుగు సినీ ప్రేక్షకులను ఐదు దశాబ్దాలకుపైగా ఆకట్టుకొన్న ప్రముఖ నటుడు రాళ్లపల్లి ఇకలేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధితో బాధపడుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. సుమారు 850పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతి వార్తతో పలువురు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణానికి సంతాపం తెలిపారు. వివారాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ
హైదరాబాద్‌లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని తన నివాసానికి తరలిస్తాం అని కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు ప్రముఖులు పార్దీవ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. మా సభ్యులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
నటుడు రాళ్లపల్లి అసలు పేరు
రాళ్లపల్లి పూర్తిపేరు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు. 1945 ఆగస్టు 15న జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఓ కుమార్తె ఇప్పటికే స్వర్గస్తులయ్యారు. మరో కుమార్తె అమెరికాలో ఉన్నారు. ఆమె హైదరాబాద్‌కు చేరుకొన్న తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. సినీ పరిశ్రమలో ఎన్నో అవార్డులు అందుకొన్నారు. రాష్ట్ర నంది పురస్కారాన్ని మూడుసార్లు అందుకొన్నారు. అలాగే 1976లో ఊరుమ్మడి బతుకులు చిత్రంలో అద్భుతమైన ప్రతిభకు ఉత్తమ కామెడీ నటుడిగా అందుకొన్నారు. గణపతి అనే సీరియల్లో ఉత్తమ సహయనటుడిగా నంది అవార్డును పొందారు.
1979లో నటజీవితం ప్రారంభం
1979లో కుక్కకాటుకు చెప్పుదెబ్బ చిత్రంతో రాళ్లపల్లి నట జీవితాన్ని ప్రారంభించారు. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో నటించారు. బొంబాయి, మిన్సారా కన్నవు అనే తమిళ చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా అన్ని రకాల పాత్రలను పోషించి మెప్పించారు.
రాళ్లపల్లి నటించిన చిత్రాలు
తూర్పు వెళ్లే రైలు, సీతాకోక చిలుక, శుభలేఖ, ఖైదీ, ఆలయ శిఖరం, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, అన్వేషణ, కూలీ నెంబర్ 1, ఏప్రిల్ ఒకటి విడుదల లాంటి హిట్ సినిమాల్లో కీలక పాత్రలను పోషించారు. ఆయన నటించిన చివరి చిత్రం భలే భలే మొగాడివోయ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015లో విడుదలైంది.