»   »  చెన్నైలో హీరో రామ్ బర్త్ డే వేడుక

చెన్నైలో హీరో రామ్ బర్త్ డే వేడుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హ్యాట్రిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "సింహా" నిర్మాత పరుచూరి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ "పండగ చేస్కో" మే 17న ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రానికి సంబందించిన మ్యూజిక్ సిట్టింగ్స్ చెన్నైలో జరుగుతున్నాయి.

దర్శకుడు గోపీచంద్, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్, రామ్ ఈ మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు. మే 15న రామ్ పుట్టినరోజు. చెన్నైలోనే 'పండగ చేస్కో' యూనిట్ సభ్యుల మధ్య రామ్ పుట్టినరోజు వేడుక జరుపుకోనున్నాడు. ఈ మేరకు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు.

 Actor Ram celebrating his birthday on may 15

"పండగ చేస్కో" చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సంగీతం: థమన్ ఎస్.ఎస్., సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ. విల్సన్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పరుచూరి ప్రసాద్, నిర్మాత: పరుచూరి కిరీటి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని.

'పండగ చేస్కో'తో పాటు మరో వైపు ఇంకో రెండు స్క్రిప్టులు కూడా ఓకే చేసారు రామ్. కెరీర్లో వేగం పెంచాలని నిర్ణయించుకున్న రామ్ ఇకపై వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. త్వరలో ఈ సినిమాలకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.

English summary
Ram Pothineni (born on May 15, 1988) is an Indian film actor of the South Indian film industry. Ram is the son of Murali Pothineni, the brother of noted film producer Ravi Kishore Pothineni, popularly known as Sravanthi Ravi Kishore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu