For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో రామ్ షాకింగ్ ట్వీట్..ఫొటో

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎప్పుడూ కూల్ గా సైలెంట్ గా ఉండే హీరో రామ్ ...ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. మీరు చూస్తున్న ఈ ఫొటోని ట్వీట్ చేస్తూ... నేను పెళ్ళి చేసుకుంటున్నాను అని అన్నారు. రామ్ ఫ్యాన్స్ కు మఖ్యంగా లేడీ ఫ్యాన్స్ కు ఇది షాకింగే మరి. దేవదాసు తో సినీ ప్రయాణం మొదలెట్టిన రామ్ ..ఇప్పటివరకూ తొమ్మిది చిత్రాలు చేసారు. ఇప్పుడు ఆయన రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా పండుగ చేస్కో చిత్రం చేస్తున్నారు. ఇది ఈ చిత్రంలో స్టిల్ అని కొందరు అంటున్నారు..నిజమోదో రామ్ క్లారిఫై ఇవ్వాల్సిందే.

  రాముడు మంచి బాలుడు.. నిన్నటి మాట. 'రామ్‌'డు.. హుషారైన కుర్రాడు. ఇది నేటి మాట. మేం చెప్పేది యువ కథానాయకుడు రామ్‌ గురించే! ఒళ్లంతా హుషారు పాకేసినట్టు, కాళ్ల కింద స్ప్రింగులు దాచుకొన్నట్టు, కనిపించని రెక్కలు తొడుక్కున్నట్టు... ఎంత దూకుడుగా ఉంటాడో..? ఇరవై ఏళ్ల కుర్రాడికి అచ్చమైన, స్వచ్ఛమైన ప్రతిరూపం.

  తెరపై అతని జోరు చూస్తుంటే 'ఆ వయసులో మనం అలా ఎందుకు లేం' అనిపిస్తుంటుంది. పద్నాలుగు రీళ్లలో పట్టుమని పది సెకన్లు కూడా దిగాలుగా మొహం పెట్టడం కనిపించదు. ఆ తీరే ప్రేక్షకులకు నచ్చింది. 'దేవదాస్‌', 'జగడం', 'మస్కా', 'కందిరీగ'... ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగాడు. నటన, డ్యాన్సులు, పోరాటాలూ, స్త్టెలింగ్‌.. ఇలా అన్నిటా తనదైన సొంత ముద్ర చూపించుకొన్నాడు. ఇప్పుడు 'పండగ చేస్కో'సినిమాతో మరోసారి వినోదాలు పంచబోతున్నాడు.

  Actor Ram Pothineni’s Shocking Tweet

  ప్రస్తుతం చేస్తున్న చిత్రం విషయానికి వస్తే..

  రామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పండగ చేస్కో' . రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ''రామ్‌ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్‌ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాయకానాయికలు, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు.

  రామ్‌ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా యూనిట్ ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

  ''ఇక్కడ చదివి విదేశాల్లో నాలుగు డాలర్లు సంపాదించుకోవడానికి యువత విదేశాలకు వెళ్లిపోతున్న రోజులివి. ఇలాంటి సమయంలో విదేశాల్లో కోట్లు సంపాదించిన ఓ యువకుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి తన వారి శ్రేయస్సు కోసం ఎలా పోరాడాడు అనేదే చిత్రం'' అన్నారు కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్‌.

  రామ్ తో చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు పరుచూరి ప్రసాద్‌.

  చిత్రంలో సాయికుమార్‌, రావు రమేష్‌, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, సంగీతం: తమన్‌, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌.

  English summary
  Ram Pothineni has tweeted that he is getting married, with a picture of him. This might be a surprise for Ram’s fans. Ram Tweeted Like this: ” Ok.. I’m getting married… :p”.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X