»   » భరించలేరు, అందుకే పెళ్లికి దూరంగా ఉంటున్నా: హీరో రానా

భరించలేరు, అందుకే పెళ్లికి దూరంగా ఉంటున్నా: హీరో రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వారి పేర్లలో తప్పకుండా ఉండే పేరు రానా దగ్గుబాటి. వయసు 32 అయినా ఈ యంగ్ స్టార్ ఇంకా పెళ్లి ఊసెత్తడం లేదు. అయితే ఎఫైర్ల విషయంలో మాత్రం రానా పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది.

బాలీవుడ్, టాలీవుడ్, ఇతర సౌత్ హీరోయిన్లో రానా చాలా క్లోజ్ రిలేషన్ షిప్ మెయింటేన్ చేస్తుంటాడు. ఈ కారణంగానే రానాపై చాలా ఎఫైర్ రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే పెళ్లికి సంబంధించి మాట్లాడే అవకాశం కానీ, అలాంటి ఊహాగానాలు గానీ మీడియాలో ప్రచారం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఇటీవల ఇంటర్వ్యూలో రానా ఇప్పటి వరకు తాను పెళ్లి చేసుకోక పోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు.

నా జీవితం పద్దతిగా లేదు

నా జీవితం పద్దతిగా లేదు

ప్రస్తుతం తన జీవితం ఒక క్రమపద్దతిలో సాగడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం వల్ల లైఫ్ పార్ట్ నర్ తో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతోనే ప్రస్తుతానికి పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు రానా తెలిపారు.

ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు

ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు

సినిమా రంగంలో ఉండటం వల్ల నా జీవన విధానం అసాధారణంగా ఉంటుంది. బాలీవుడ్ సినిమాలు చేస్తే ఆరు నెలలు అక్కడే ఉండాను. హైదరాబాద్ కు నెలల పాటు దూరంగా ఉన్న సందర్భాలు అనేకం. వచ్చే ఏడాది టీవీ షోల గురించి చర్చించడానికి అమెరికా వెళ్తున్నా. మూడు నెలలు అక్కడే ఉంటాను. డిస్కషన్స్ పూర్తి కాకపోతే ఏడాది అక్కడే ఉండొచ్చు అని రానా తెలిపారు.

ఇలాంటివి భరించలేరు

ఇలాంటివి భరించలేరు

పెళ్లయితే ఇలా నెలల తరబడి దూరంగా ఉంటే భార్యలు భరించలేరు. నాకు ప్రొఫెషన్ పరంగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ప్రస్తుతానికి పెళ్లికి దూరంగా ఉంటున్నారు. లైఫ్ కాస్త సెట్టయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తాను అని రానా తెలిపారు.

రానా, అఖిల్ మధ్యలో శ్రియా భూపాల్: సోషల్ మీడియాలో వైరల్ ఫొటో

రానా, అఖిల్ మధ్యలో శ్రియా భూపాల్: సోషల్ మీడియాలో వైరల్ ఫొటో

సినిమాల్లో కాస్త గంభీరంగా క‌నిపిస్తాడు కానీ రియ‌ల్ లైఫ్ లో మాత్రం చాలా జోవియల్ గా ఉంటాడు. చివ‌ర‌కు సెట్స్ లోనూ, స్టేజ్ మీద కూడా అలానే వ్య‌వ‌హరిస్తాడు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రౌద్రం అంటే ఇదీ.. భల్లాల దేవ స్టన్నింగ్ లుక్ (ఫొటోలు )

రౌద్రం అంటే ఇదీ.. భల్లాల దేవ స్టన్నింగ్ లుక్ (ఫొటోలు )

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా , అనుష్క హీరోయిన్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కామీడియా పతాకంపై ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో శోభు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

రానా తెలివైనోడే... ముందే లాయిర్ ని సంప్రదించాడట

రానా తెలివైనోడే... ముందే లాయిర్ ని సంప్రదించాడట

రమ్మి, తంబోల వంటి జూదాలకు అనుమతులు పొందుతున్న వెబ్‌సైట్‌లు, వాటిని నిత్యం పెంపొందిస్తునే ఉన్నాయి.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Rana is said to be one of the most eligible bachelors and he has been rumoured to be dating many actresses in the past. In a recent interview Rana open up about his marriage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu