»   » మంచి పని కోసం...రైతు బాజర్లో మూటలు మోసిన హీరో రానా

మంచి పని కోసం...రైతు బాజర్లో మూటలు మోసిన హీరో రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి ‘మేముసైతం' అనే సమాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను భాగస్వామ్యం చేసి నిధుల సేకరణ కార్యక్రమం చేపడుతూ ఆ నిధులను సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆ మధ్య కూకట్‌పల్లిలోని మంజీరా మాల్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూరగాయలు అమ్మింది. నిన్న అక్కినేని యంగ్ తరంగ్ అఖిల్ ఖమ్మంలో ఆటో నడిపాడు. తాజాగా ఈ లిస్టులో హీరో రానా కూడా చేరాడు. ఈ కార్యక్రమంలో భాగంగా రానా రైతు బాజార్లో కూలి అవతారం ఎత్తి మూటలు మోసారు.

అది చూసాక నన్ను ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు: రానా

ఒక మంచి పని కోసం చేస్తున్న కార్యక్రమం కావడంతో మంచు లక్ష్మికి ఇతర టాలీవుడ్ స్టార్ నుండి సహాయం అందుతోంది. మంచు లక్ష్మి తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాల్లో వారూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. టాలీవుడ్ స్టార్లంతా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుందాం.

రానా సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం రానా తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి-2', శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లీడర్' సీక్వెల్, సబ్ మెరైన్ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న వార్ మూవీతో పాటు తమిళంలో బాల దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు.

English summary
Actress Manchu Lakshmi is conducting a program called Memu Saitham to help the victims of Chennai Floods. Some of the popular actors are also joining her in the event. Rana Daggubati, who has been in front in Memu Saitham always, has appeared as a Kooli at Rythu Bazaar for some time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu