»   » డోంట్ ట్రబుల్ హర్, గోడపై రంగనాథ్ సందేశం (ఫోటోస్)

డోంట్ ట్రబుల్ హర్, గోడపై రంగనాథ్ సందేశం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విలక్షణ నటుడు రంగనాథ్ శనివారం ఆత్మహత్చ చేసుకున్న సంగతి తెలిసిందే. తన ఇంట్లోనే ఉరివేసుకున్నారు. గోడ మీద 'డెస్టినీ' అని రాశారు. తన ఫ్రెండ్ దేవదాసుకు 'గుడ్ బై' అని మెసేజ్ పంపించారు.

అలాగే, ఆంధ్రా బ్యాంకులోఉన్న ఫిక్సెడ్ డిపాజిట్స్ మీనాక్షీకి ఇవ్వమని, డోంట్ ట్రబుల్ హర్ అని గోడ మీద రాశారు. మీనాక్షి చాలా కాలంగా రంగనాథ్ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. ఇన్నాళ్లుగా తనకు సహాయంగా ఉన్న ఆమెకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా రాసినట్లు స్పష్టమవుతోంది.

రంగనాథ్ చాలా మంచి మనిషి, అని, తాను అటువంటి మంచి మనిషిని చూడలేదని పని మనిషి మీనాక్షి చెప్పింది. తాను మధ్యాహ్నం 12 గంటలకు రంగనాథ్ కూతురు ఇంటికి వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇంటి గడియ లోపలి నుంచి పెట్టి ఉందని, తలుపు తీయకపోవడంతో తాను రంగనాథ్ కూతురును, స్థానికులను పిలిచానని ఆమె చెప్పారు.

తలుపులు పగులగొట్టి చూసేసరికి రంగనాథ్ ఉరి వేసుకుని కనిపించారని, ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. తమ తండ్రి రంగనాథ్ తాను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు అంటుండేవారని ఆయన కూతురు నీరజ చెప్పారు. తాము అందుకు కౌన్సెలింగ్ కూడా ఇప్పించామని ఆమె చెప్పారు.

స్లైడ్ షోలోఫోటోస్...

రంగనాథ్

రంగనాథ్

విలక్షణ నటుడు రంగనాథ్ శనివారం ఆత్మహత్చ చేసుకున్న సంగతి తెలిసిందే. తన ఇంట్లోనే ఉరివేసుకున్నారు.

గోడలపై సందేశం

గోడలపై సందేశం

ఆంధ్రా బ్యాంకులోఉన్న ఫిక్సెడ్ డిపాజిట్స్ మీనాక్షీకి ఇవ్వమని, డోంట్ ట్రబుల్ హర్ అని గోడ మీద రాశారు. మీనాక్షి చాలా కాలంగా రంగనాథ్ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. ఇన్నాళ్లుగా తనకు సహాయంగా ఉన్న ఆమెకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా రాసినట్లు స్పష్టమవుతోంది.

మీనాక్షి

మీనాక్షి

రంగనాథ్ చాలా మంచి మనిషి, అని, తాను అటువంటి మంచి మనిషిని చూడలేదని పని మనిషి మీనాక్షి చెప్పింది. తాను మధ్యాహ్నం 12 గంటలకు రంగనాథ్ కూతురు ఇంటికి వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇంటి గడియ లోపలి నుంచి పెట్టి ఉందని, తలుపు తీయకపోవడంతో తాను రంగనాథ్ కూతురును, స్థానికులను పిలిచానని ఆమె చెప్పారు.

నీరజ

నీరజ

తమ తండ్రి రంగనాథ్ తాను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు అంటుండేవారని ఆయన కూతురు నీరజ చెప్పారు. తాము అందుకు కౌన్సెలింగ్ కూడా ఇప్పించామని ఆమె చెప్పారు.

Read more about: ranganath, tollywood
English summary
Actor Ranganath ends life, leaves all his wealth to maid Meenekshi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu